Chiranjeevi Oxygen Bank: కరోనా వైరస్ దేశంలో అడుగు పెట్టి.. కల్లోలం సృష్టించడం మొదలు పెట్టినప్పటి నుంచి సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ తమకు తోచిన విధంగా సాటివారికి సాయం అందిస్తున్నారు. కష్టకాలంలో అండగా నిలుస్తూ.. మానవత్వం చూపుతున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో కేసులు నమోదవున్నాయి. ఆక్సిజన్ అందక భారీ సంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి అండగా చిరంజీవి వీరాభిమాని శ్రీనివాసరావు తనయ విరాళం అందించారు. విజయవాడ వాస్తవ్యులైన శ్రీనివాసరావు ప్రస్తుతం లండన్ లో సెటిల్ అయ్యారు. జనసేన పార్టీకి లండన్ నుండి విశేష సేవలు అందిస్తున్నారు.
ఈరోజు శ్రీ P.శ్రీనివాస్ అమ్మాయి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో చిన్నారి అన్షి దాచుకున్న డబ్బులు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు కి విరాళంగా ఇచ్చింది. శ్రీనివాసరావు తన కూతురు అన్షిని పుట్టిన్ రోజు కానుకగా ఏమికావాాాాాాలని అడగగా.. చిరంజీవి అంకుల్ ఆక్సిజన్ బ్యాంక్ కు తన అమౌంట్ ను విరాళంగా ఇవ్వమని కోరింది. వెంటనే ఆ తల్లిదండ్రులు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు ఒక లక్షరూపాయలు చెక్ ను అందచేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు హరిణి దంపతులకు మెగాస్టార్ చిరంజీవి తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చిన్నారి అన్షి కు మెగాస్టార్ చిరంజీవి తరపున హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ అందజేసింది.
Also Read: పనస తొనలు తిని.. గింజలు పడేస్తున్నారా.. అయితే మీకోసమే టేస్టీ టేస్టీ పనస గింజల కూర తయారీ విధానం