Britain Lockdown: నేటి నుంచి బ్రిటన్‌లో రెండో దఫా లాక్‌డౌన్‌ అమలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా

Britain Lockdown: నేటి నుంచి బ్రిటన్‌లో రెండో దఫా లాక్‌డౌన్‌ కొనసాగనుంది. స్ట్రెయిన్‌ వైరస్‌ కారణంగా బ్రిటన్‌ ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేసింది....

Britain Lockdown: నేటి నుంచి బ్రిటన్‌లో రెండో దఫా లాక్‌డౌన్‌ అమలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2021 | 6:53 AM

Britain Lockdown: నేటి నుంచి బ్రిటన్‌లో రెండో దఫా లాక్‌డౌన్‌ కొనసాగనుంది. స్ట్రెయిన్‌ వైరస్‌ కారణంగా బ్రిటన్‌ ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కొరఢా ఝులిపించనుంది. మొదటి సారి లాక్‌డౌన్‌ ఉల్లంఘించినట్లయితే రూ.20 వేల జరిమానా విధించనుంది. అలాగే రెండో సారి ఉల్లంఘిస్తే రూ.6.36 లక్షల జరిమానా విధించనుంది.

కాగా, ఒక వైపు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుందనేలోపు ఈ కొత్త రకం కరోనా వైరస్‌ విజృంభించడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. యూకేలో వెలుగు చూసిన ఈ ‘స్ట్రెయిన్’ ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. సాధారణ కరోనా కంటే ‘స్ట్రెయిన్’ వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోఆన నుంచి పూర్తి స్థాయిలో కోలుకోక ముందే ఈ స్ట్రెయిన్‌ వైరస్‌తో మరిన్ని ఇబ్బందులు తెచ్చే పెట్టే అవకాశాలున్నాయి. ఈ కొత్త వైరస్‌ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం లాక్‌డౌన్‌తో నిబంధనలు కఠితరం చేసింది. ఈ కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌తో ఇతర దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. మరోసారి లాక్‌డౌన్‌ విధించేందుకు సిద్ధమవుతున్నాయి.

Alibaba Founder Jack Ma: రెండు నెలలుగా కనిపించకుండా పోయిన జాక్‌మా ఎక్కడ..? అదృశ్యంపై పలు అనుమానాలు