రష్యాతో ఆ డీల్ కుదుర్చుకుని ఆచరణలో పెడితే, ఇండియాకు అమెరికా హెచ్ఛరిక, ఆంక్షలు తప్పవు

రష్యా నుంచి ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా మండిపడింది.

రష్యాతో ఆ డీల్ కుదుర్చుకుని ఆచరణలో పెడితే, ఇండియాకు అమెరికా హెచ్ఛరిక, ఆంక్షలు తప్పవు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2021 | 11:54 AM

రష్యా నుంచి ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా మండిపడింది. ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని ఇండియాలో అమెరికా రాయబారి కెనెత్ జస్టర్ అన్నాడు. ఈయన త్వరలో పదవి నుంచి వైదొలగనున్నారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన.. తన మిత్ర దేశాలపై అమెరికా ఆంక్షలు విధించాలనుకోవడం లేదన్నారు. కాగా అమెరికాతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలా లేక ఈ దేశం నుంచి ఆధునిక మిలిటరీ హార్డ్ వేర్ ను కొనుగోలు  చేయాలా అన్న అంశాన్ని ఇండియా తేల్చుకోవలసి ఉంటుందన్నారు.భవిష్యత్తులో  ఉభయ దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుందని  జస్టర్ పేర్కొన్నారు.

రష్యా నుంచి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం లను కొనుగోలు చేసేందుకు ఆ దేశంతో 5.4 బిలియన్ డాలర్ల డీల్ ను కుదుర్చుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికా కాంగ్రెస్ లో ఈ మేరకు వచ్చిన వార్తలను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. 2018 అక్టోబరులో భారత-రష్యాల మధ్య ఈ  ఒప్పందం కుదిరింది. రష్యా నుంచి ఈ విధమైన సిస్టమ్స్ ను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా  డిసెంబరు 15 న ఆంక్షలు విధించింది. us envoy warns india on s-400 deal with russia, delhi, us envoy kenneth juster, india, russia, us, sanctions.