Laziest Citizen Contest: అక్కడ సోమరిపోతు ఎవరో అనే వింత పోటీ.. గత 20 రోజులుగా నిద్రపోతూ గత రికార్డ్ బద్దలు

|

Sep 09, 2023 | 12:55 PM

యూరప్‌లోని ఉత్తర మాంటెనెగ్రోలోని బ్రెజ్నా అనే రిసార్ట్ గ్రామంలో ఈ వింత పోటీ జరుగుతోంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పోటీలో ప్రస్తుతం ఏడుగురు పోటీదారులు 'సోమరి పౌరుడు' అనే బిరుదు పొందడం కోసం ఆశతో తమ సోమరితనాన్ని ప్రదర్శిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ఏడుగురు పోటీదారులు గత 20 రోజులుగా నిరంతరం పడుకునే ఉంటున్నారు.

Laziest Citizen Contest: అక్కడ సోమరిపోతు ఎవరో అనే వింత పోటీ.. గత 20 రోజులుగా నిద్రపోతూ గత రికార్డ్ బద్దలు
Laziest Citizen Contest
Follow us on

ప్రపంచవ్యాప్తంగా రకరకాల పోటీలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని పోటీలు గానానికి సంబంధించినవి, కొన్ని నృత్యానికి సంబంధించినవి. కొన్ని క్రీడలకు సంబంధించినవి. చాలా చోట్ల ఇలాంటి పోటీలు జరుగుతూనే ఉన్నాయి. వీటి గురించి తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యపోతారు. చీజ్ రోలింగ్ కాంటెస్ట్, హై హీల్ డ్రాగ్ క్వీన్ రేస్, స్లాపింగ్ కాంటెస్ట్ ఇలా అనేక రకాల వింత పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వార్తల్లో ఒక  విచిత్రమైన పోటీ చర్చలో జరుగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనేవారు సోమరితనాన్ని చూపించవలసి ఉంటుంది. ఎవరైతే అత్యంత సోమరితనంగా ఉంటారో వారే ఈ పోటీలో విజేతగా పరిగణిస్తారు.

యూరప్‌లోని ఉత్తర మాంటెనెగ్రోలోని బ్రెజ్నా అనే రిసార్ట్ గ్రామంలో ఈ వింత పోటీ జరుగుతోంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పోటీలో ప్రస్తుతం ఏడుగురు పోటీదారులు ‘సోమరి పౌరుడు’ అనే బిరుదు పొందడం కోసం ఆశతో తమ సోమరితనాన్ని ప్రదర్శిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ఏడుగురు పోటీదారులు గత 20 రోజులుగా నిరంతరం పడుకునే ఉంటున్నారు. గత సంవత్సరం 117 గంటల రికార్డును ఈ సోమరిపోతులు చాలా కాలం క్రితమే బద్దలు కొట్టారు. అంతేకాదు గత రికార్డ్ ను చెరిపి సరికొత్త రికార్డుని సృష్టించడానికి ముందుకు సాగుతున్నారు.

ఎలా పోటీ మొదలైందంటే

ఈ పోటీలో 21 మంది పాల్గొన్నారు. ఈ పోటీ ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఒకొక్కరూ పోటీ నుంచి  తప్పుకున్నారు. ఇప్పుడు కేవలం 7 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఈ విశిష్ట పోటీ నిర్వాహకుడు.. రడోంజా బ్లాగోజెవిక్ మాట్లాడుతూ.. ఇది 12వ ఎడిషన్ ‘లెజిస్టెస్ట్ సిటిజన్’ పోటీ అని చెప్పారు. ఈ పోటీ గత 12 సంవత్సరాలుగా కొనసాగుతోందని అన్నారు. ఈ వింత పోటీ ఎలా మొదలైందో  కూడా చెబుతూ.. నివేదికల ప్రకారం మోంటెనెగ్రో ప్రజలు అత్యంత సోమరితనంతో ఉంటారని.. ఈ మాటలను చెరిపేయ్యాలనే తాము ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. 12 సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైన ఈ పోటీ నేటికీ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

పోటీ నియమాలు ఏమిటంటే

ఈ పోటీలో పాల్గొనే వారు తినడానికి, తాగడానికి, చదవడానికి, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడానికి అనుమతిస్తారు. అయితే ఈ పనులన్నీ పడుకునే చేయవలసి ఉంటుంది. అయితే తీ పోటీల్లో లేవడం, కూర్చోవడం, నిలబడడం వంటి నిబంధనలను ఉల్లంఘనగా పరిగణిస్తారు. పోటీ మధ్యలో ఎవరైనా ఈ నిబంధనలు పాటించకపోతే వెంటనే పోటీ నుండి తొలగిస్తారు. అయినప్పటికీ పోటీల్లో పాల్గొనేవారు ప్రతి 8 గంటలకు 10 నిమిషాల బాత్రూమ్ కు వెళ్లడం కోసం విరామం ఇస్తారు. ఈ అద్వితీయ పోటీలో ఎవరు గెలుపొందినా వారికి 1,070 డాలర్లు అంటే దాదాపు రూ. 89 వేల బహుమతిని ఇస్తారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..