India – Bangladesh: భారత్ – బంగ్లాదేశ్ మధ్య రైళ్ల పరుగులు.. రెండేళ్ల తర్వాత తొలిసారి

భారత్ కు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్(Bangladesh) కు రాకపోకలు సాగించేందుకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నుంచి కొన్ని రైళ్లు నడుస్తున్నాయి. అయితే రెండేళ్ల క్రితం కరోనా విజృంభించడంతో పలు దేశాల మధ్య సంబంధాలు...

India - Bangladesh: భారత్ - బంగ్లాదేశ్ మధ్య రైళ్ల పరుగులు.. రెండేళ్ల తర్వాత తొలిసారి
Bandhan Express

Updated on: May 30, 2022 | 9:45 AM

భారత్ కు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్(Bangladesh) కు రాకపోకలు సాగించేందుకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నుంచి కొన్ని రైళ్లు నడుస్తున్నాయి. అయితే రెండేళ్ల క్రితం కరోనా విజృంభించడంతో పలు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఇరుదేశాల మధ్య రవాణాకు ఈ రైళ్లు ఎంతో కీలకం. వీటిని తిరిగి ప్రారంభించాలన్న ప్రయాణికుల విజ్ఞప్తితో ఈ రైలు సేవలను అధికారులు పునరుద్ధరించారు. కోల్‌కతా(Kolkata) నుంచి బంగ్లాదేశ్‌లోని ఖుల్నాకు వెళ్లే బంధన్‌ ఎక్స్‌ప్రెస్‌(Bandhan Express) రైలు ఆదివారం బయల్దేరిందని తూర్పు రైల్వే అధికారులు ప్రకటించారు. కోల్‌కతా-ఢాకా మధ్య తిరిగే మైత్రి ఎక్స్‌ప్రెస్‌ సేవల్నీ పునరుద్ధరించినట్లు చెప్పారు. బంధన్‌ ఎక్స్‌ప్రెస్‌ వారంలో రెండు రోజులు, మైత్రి ఎక్స్‌ప్రెస్‌ ఐదు రోజులు నడుస్తుందని వెల్లడించారు. రైలు సేవల పునరుద్ధరణపై ఇరు దేశాల సరిహద్దులోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు.. బంగ్లాదేశ్‌ మధ్య మూడో రైలు సర్వీస్‌ జూన్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయిగురి నుంచి బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా మధ్య మిథాలి ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తుంది. ఈ మూడు రైళ్లకు ఇప్పటికే టిక్కెట్లు కూడా బుక్ అయ్యాయని వెల్లడించారు. బంధన్ ఎక్స్ ప్రెస్ భారత్ నుంచి బయలుదేరి కోల్ కతా నుంచి బంగ్లాదేశ్ లోని ఖుల్నా చేరుకుని తిరిగి కోల్ కతా చేరుకుంటుంది. మైత్రీ ఎక్స్ ప్రెస్ కోల్ కతా నుంచి బయలుదేరి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని తిరిగి కోల్ కతాకు వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us