Whirlpool Galaxy: అంతరిక్షంలో మరో అద్భతం.. గులాబీ, నీలి వర్ణంతో సుడిగుండంలాంటి పాలపుంత..

ఖగోళం అంటేనే అంతులేని రహస్యాలకు నెలవు. ప్రతి చిన్న విషయమూ అబ్బురపరుస్తుంటుంది. అంతరిక్షంలో వెలుగులోకి వచ్చే ప్రతి అంశమూ ఇప్పటి విజ్ఞానానికి సవాల్ విసురుతూ ఉంటుంది. విశ్వాన్ని ఊహించుకుంటే..

Whirlpool Galaxy: అంతరిక్షంలో మరో అద్భతం.. గులాబీ, నీలి వర్ణంతో సుడిగుండంలాంటి పాలపుంత..

|

Updated on: May 30, 2022 | 7:47 AM


ఖగోళం అంటేనే అంతులేని రహస్యాలకు నెలవు. ప్రతి చిన్న విషయమూ అబ్బురపరుస్తుంటుంది. అంతరిక్షంలో వెలుగులోకి వచ్చే ప్రతి అంశమూ ఇప్పటి విజ్ఞానానికి సవాల్ విసురుతూ ఉంటుంది. విశ్వాన్ని ఊహించుకుంటే.. అందులో ఎన్నో పాలపుంతలు.. అందులోనూ మనలాంటి సౌర కుటుంబాలెన్నో.. గ్రహాలు.. ఉపగ్రహాలు ఇలా ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది. మన సౌర కుటుంబంలో ఇతర గ్రహాలతోపాటు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి కుటుంబాలను కలిపి ఒక గెలాక్సీగా పాలపుంతగా పేర్కొంటారు. నాసాకు చెందిన హబ్బుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌.. గత ముప్పై ఏళ్ల కాలంలో కొన్ని మిలియన్ల ఫొటోలు తీసింది. కానీ, తాజాగా తీసిన ఓ ఫొటో మాత్రం మహాద్భుతమనే ప్రశంసను దక్కించుకుంటోంది. గుండ్రని వలయాలు, గులాబీ రంగులో నక్షత్రాలు, నీలి రంగు నక్షత్ర సమూహాలు.. వెరసి ఎం51 పాలపుంత ఫొటోల్ని పక్కాగా తీసి పంపింది హబ్బుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌. అంతరిక్షంలో గెలాక్సీ ఎం51(దీనికి వర్ల్‌పూల్‌ గెలాక్సీ) అనే పేరు కూడా ఉంది. సర్వేల కోసం ఏర్పాటు చేసిన హబ్బుల్‌ అడ్వాన్స్‌డ్‌ కెమెరా ఈ ఫొటోల్ని క్లిక్‌మనిపించింది. గంభీరమైన స్పైరల్ గెలాక్సీ M51 వెడల్పాటి చేతులు.. నిజానికి నక్షత్రాల పొడవైన లేన్లు, ధూళితో నిండిన వాయువు. గ్రాండ్-డిజైన్ స్పైరల్ గెలాక్సీలుగా వీటిని పిలుస్తారు. M51.. భూమి నుండి 31 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కేన్స్ వెనాటిసి నక్షత్రరాశిలో ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Follow us