North Korea: కిమ్‌కు ఏమైంది ?..140 కిలోల బరువు పెరిగాడా ?.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిఘా సంస్థ

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంద్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కఠినమైన చట్టాలు, నిర్ణయాలతో దేశ ప్రజలను సతమతం చేస్తూ నియంతృత్వాన్ని చాటుతుంటాడు. అయితే ఇటీవల కిమ్ జోంగ్‌కు సంబంధించి ఆరోగ్య సమస్యలు బయటపడ్డాయి.

North Korea: కిమ్‌కు ఏమైంది ?..140 కిలోల బరువు పెరిగాడా ?.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిఘా సంస్థ
Kim Jong Un

Updated on: Jun 01, 2023 | 5:28 PM

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంద్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కఠినమైన చట్టాలు, నిర్ణయాలతో దేశ ప్రజలను సతమతం చేస్తూ నియంతృత్వాన్ని చాటుతుంటాడు. అయితే ఇటీవల కిమ్ జోంగ్‌కు సంబంధించి ఆరోగ్య సమస్యలు బయటపడ్డాయి. అతడు తీవ్రమైన నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని దక్షిణ కొరియాకి చెందిన నెషనల్ ఇంటిలిజెన్స్ సర్వీస్ అనే నిఘా సంస్థ భావిస్తోంది. అలాగే కిమ్ విపరీతంగా బరువు కూడా పెరిగనట్లు గుర్తించింది. అతనికి ఉన్న ఆల్కహాల్, నికోటిన్ వ్యసనాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది దీంతో ఉత్తర కొరియా అధికారులు.. కిమ్ నిద్రలేని సమస్యకు చికిత్స చేయించేందుకు లోతైన వైద్య సమాచారం సేకరించే పనిలో పడ్డట్లు గుర్తించింది.

ఇటీవలే ఉత్తరకొరియా పెద్ద ఎత్తు విదేశీ సిగరేట్లను, ఆల్కహాల్‌తో పాటు తీసుకనే చిరుతిళ్లను దిగుమతి చేసుకుందని వెల్లడించింది. కిమ్‌కు చెందిన తాజా చిత్రాలను కృత్రిమ మేధతో విశ్లేషించగా అతడు బరువు పెరిగాడని.. ప్రస్తుతం అతని బరువు 140 కిలోల వరకు ఉండొచ్చని తెలిపింది. ఇదిలా ఉండగా కిమ్‌ మద్యానికి, సిగరెట్లకు బానిసగా మారిపోయినట్లు అమెరికాకు చెందిన ఓ పత్రిక కూడా తన కథనంలో వెల్లడించింది. అతడిలో నిద్రలేమి సమస్యలు తలెత్తినట్లు తెలిపింది. దీంతో అతని కంటి కింద తీవ్రమైన నల్లటి వలయాలు కనిపిస్తున్నాయని తెలిపింది. అతడు జోల్పిడియం వంటి ఔషధాలను కూడా వినియోగిస్తిన్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..