సన్న బడుతున్న కిమ్ జాంగ్……నార్త్ కొరియా అధినేత ఆరోగ్యంపై రేగుతున్న ఊహాగానాలు

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్ గతంలో మాదిరి...దృఢంగా, బలంగా కనిపించడం లేదు.. బరువు తగ్గినట్టు ఉన్నాడు. కాస్త బలహీనంగా..సన్నగా కనబడుతున్నాడు.. తాజాగా స్టేట్ మీడియా శనివారం విడుదల చేసిన ఫోటోలు చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది.

సన్న బడుతున్న కిమ్ జాంగ్......నార్త్ కొరియా అధినేత  ఆరోగ్యంపై రేగుతున్న ఊహాగానాలు
Kim Jong Un Apparent Weight Loss Prompts Speculation On His Health

Edited By: Anil kumar poka

Updated on: Jun 09, 2021 | 5:54 PM

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్ గతంలో మాదిరి…దృఢంగా, బలంగా కనిపించడం లేదు.. బరువు తగ్గినట్టు ఉన్నాడు. కాస్త బలహీనంగా..సన్నగా కనబడుతున్నాడు.. తాజాగా స్టేట్ మీడియా శనివారం విడుదల చేసిన ఫోటోలు చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు కదా అని చాలామంది అప్పుడే చెవులు కొరుక్కుంటున్నారు. గతవారం అధికార పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న కిమ్…చాలా బరువు తగ్గినట్టు కనిపించాడు. దాదాపు 40 ఏళ్ళ వయసున్న ఈయన చేతి వాచ్ స్ట్రాప్ ని ఇటీవల మాటిమాటికీ బిగించుకుంటూ ఉండడం చూసిన నేతలంతా ఇలాగే అనుకున్నారట. పైగా కిమ్ హెవీ స్మోకర్ కూడా.. 2011 లో ఈయన తండ్రి ఆరోగ్య సమస్యలతో మరణించాడు . కాగా-కావాలనే బరువు తగ్గాలనే కిమ్ యత్నిస్తున్నాడా అని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఓ ఎనలిస్ట్ అయితే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఉత్తర కొరియా ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.ఆహార కొరతను .ఆర్ధిక క్షీణతను ఎదుర్కొంటోంది. కరోనా సమస్య పెద్దగా లేనప్పటికీ ఈ వైరస్ పాండమిక్ దృష్ట్యా,, చైనాతో నార్త్ కొరియా వాణిజ్యం చాలావరకు మందగించింది.

ప్రకృతి వైపరీత్యాల మాట అటుంచి… అణుపరీక్షల కారణంగానో, మిసైల్స్ ప్రయోగాల కారణంగానో అంతర్జాతీయ దేశాలు ఈ దేశంపై ఆంక్షలు విధించాయి. ఆ దేశాల అభ్యంతరాలను పట్టించుకోకుండా కిమ్ ప్రభుత్వం అదేపనిగా తమ న్యూక్లియర్ లేదా మిసైల్ ప్రయోగాలకు ప్రాధాన్యమిస్తూ వచ్చింది. ఆ మధ్య సుమారు నెల రోజుల పాటు కిమ్ జాంగ్ ఉన్ జాడ లేకపోయేసరికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందనో, అసలు మరణించాడేమోనని కూడా ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే వాటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఓ ఎరువుల కర్మాగారానికి తన సోదరితో సహా వచ్చి కనిపించాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల మూడు రోజులుగా.తంటాలు పడుతున్న పిల్ల కోతి..వైరల్ అవుతున్న వీడియో :Monkey Viral Video.

ఆనందయ్య ఆవేదన..!ఆనందయ్య మందు పంపిణీలో గందరగోళం..అయన శిష్యులు ఎంత మంది ? :Anandaiah Corona Medicine video.

బధిరుల వార్తలు : భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..థర్డ్ వెవ్ పిల్లలపై మరింత ప్రభావితం..:cases decrees in India.

డబుల్ కిక్కుతో మాస్ కా దాస్..ఫలక్ నుమా దాస్ మూవీ కి సీక్కుల్ ను ప్రకటించిన విశ్వక్ సేన్ : Falaknuma Das sequel.