Pakistan – Justice Ayesha Malik: పాకిస్థాన్ చరిత్రలో తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ అయేషా మాలిక్ బాధ్యతలు చేపట్టనున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్ జస్టిస్ ముషీర్ ఆలమ్ సిఫార్సు మేరకు జస్టిస్ ఆయేషా మాలిక్ ఆ దేశ సీజేపీగా నియమితులుకానున్నారు. జస్టిస్ ముషీర్ ఆలమ్ ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఆయేషా మాలిక్‌ను సీజేపీగా పాకిస్థాన్ జ్యుడిషియల్ కమిషన్ నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె లాహోర్ హైకోర్టు జడ్జిగా సేవలందిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం ఆమె నాలుగో స్థానంలో ఉన్నారు. అయినా చీఫ్ జస్టిస్ రేసులో ఆమె ముందున్నారు.
లాహోర్‌లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా(PCL)లో ఆమె లా చదువుకున్నారు. ఆ తర్వాత లండన్‌లోని హార్వర్డ్ లా స్కూల్‌లో లాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కరాచీలో 1997 నుంచి 2001 వరకు న్యాయవాదిగా పనిచేశారు. 2012లో లాహోర్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. పాకిస్థాన్‌లోని పలు హైకోర్టులు, జిల్లా కోర్టులు, బ్యాంకింగ్ కోర్టులు, స్పెషల్ ట్రైబ్యునల్స్, ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్స్‌లలో ఆమె సేవలందించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ జడ్జెస్(IAWJ) లోనూ సభ్యురాలిగా ఉన్నారు.
లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళా హక్కులు, మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో జస్టిస్ ఆయేషా మాలిక్ చారిత్రక తీర్పులు ఇచ్చారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్‌గా ఓ మహిళ నియమితులుకానుండటం ఓ మంచి వార్త అంటూ డాన్ పత్రిక వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌లో మహిళా హక్కుల ఉల్లంఘనపై తరచూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఓ మహిళ పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ కానున్నారన్న కథనాలు అంతర్జాతీయ మీడియా వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
Also Read..
సమంత లేటెస్ట్ ఫోట్.. మూడు గంటల్లో పదిలక్షలకు పైగా లైకులు.. ఆ ఫోటో ఏంటో మీరూ చూడండి..
“నేనే మంత్రాలతో చంపా.. పూజలతో మళ్లీ బ్రతికిస్తా”.. జగిత్యాలలో కలకలం