Joe Biden: వైట్‌హౌస్‌లో అధికారిని కరిచిన బైడెన్ పెంపుడు శునకం.. ఇప్పటికి 11 సార్లు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి రక్షణ కల్పించే భద్రతాధికారులకు ఇప్పుడు కుక్కలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ పెంపుడు శునకం కమాండర్‌ మరోసారి ఓ సీక్రెట్ సర్వీస్‌ అధికారిని కరవడం చర్చనీయాంశమవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్లినట్లైతే.. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో వైట్‌హౌస్ లో విధి నిర్వహణలో ఉన్న ఓ సీక్రెట్ సర్వీస్‌ అధికారిని జో బైడెన్‌ పెంపుడు శునకం కమాండర్‌‌ కరిచింది.

Joe Biden: వైట్‌హౌస్‌లో అధికారిని కరిచిన బైడెన్ పెంపుడు శునకం.. ఇప్పటికి 11 సార్లు
Joe Biden With His Pet Dog

Updated on: Sep 27, 2023 | 7:18 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి రక్షణ కల్పించే భద్రతాధికారులకు ఇప్పుడు కుక్కలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ పెంపుడు శునకం కమాండర్‌ మరోసారి ఓ సీక్రెట్ సర్వీస్‌ అధికారిని కరవడం చర్చనీయాంశమవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్లినట్లైతే.. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో వైట్‌హౌస్ లో విధి నిర్వహణలో ఉన్న ఓ సీక్రెట్ సర్వీస్‌ అధికారిని జో బైడెన్‌ పెంపుడు శునకం కమాండర్‌‌ కరిచింది. కుక్క కాటుకు గాయాలపాలైన ఆ వ్యక్తికి ఘటనా స్థలంలోనే చికిత్స అందించామని శ్వేత సౌధం పేర్కొంది. జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన కమాండర్‌ అనే ఆ శునకం.. అధికారులపై దాడి చేయడం ఇది 11వ సారి. దీంతో అక్కడ పనిచేసే అధికారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటనపై వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ తన స్పందనను తెలియజేశారు.

వైట్‌హస్ ఎంతో ప్రత్యేకమైనంది. కానీ ఈ పెంపుడు జంతువులకు ఇక్కడ వాతావరణం ప్రత్యేకంగా అనిపించడం వల్ల ఒత్తిడికి లోనవుతుంటాయని తెలిపారు. దీనివల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆ కమాండర్‌ శునకానికి అలాగే ఆ అధికారికి అంతగా పరిచయం లేదని.. అందువల్లే ఆ శునకం ఆ అధికారిపై దాడి చేసిందని వివరించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆ సీక్రెట్ సర్వీస్ అధికారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన రెండేళ్ల ‘కమాండర్‌’ అనే పెంపుడు శునకాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఇది 2022 అక్టోబరు నుంచి 2023 జనవరి మధ్య కాలంలో ఏకంగా పదిసార్లు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులను కరిచింది.

దీనివల్ల వైట్‌హౌస్‌లో పనిచేసే అధికారుల పట్ల ఎలా ఉండాలో కమాండర్‌కు బైడెన్ కుటుంబ సభ్యులు జులై నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. అలాగే అంతకుముందు కూడా మేజర్‌ అనే మరో శునకం జో బైడెన్‌ వద్ద ఉండేది. ఆ శునకం కూడా కొంతమంది సీక్రెట్ సర్వీసు అధికారుల్ని.. అలాగే శ్వేతసౌధం సిబ్బందిని కరిచింది. దీంతో ఆ శునకాన్ని డెలావర్‌లో ఉన్నటువంటి తన మిత్రుల వద్దకు జో బైడెన్ దాన్ని పంపించేశారు. అయితే జో బైడెన్ వద్ద విల్లో అనే మరో పిల్లి కూడా ఉంది. ఇదిలా ఉండగా.. మరో విషయం ఏంటంటే..కమాండర్ అనే శునకాన్ని బైడెన్ కు ఆయన సోదరుడు జేమ్స్ బహుమతిగా ఇచ్చారట. అయితే ఇలా వైట్ హౌస్ శునకాల దాడుల వల్ల అక్కడి అధికారుల్లో కొంత ఆందోళన నెలకొంది. మరోవైపు ఆ సీక్రెట్ సర్వీస్ అధికారికి, ఆ కమాండర్ శునకం పరిచయం లేకపోవడం వల్ల అలా దాడి చేసినట్లు వివరణనిచ్చారు వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రటరీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.