
అమెరికా, చైనా మధ్య బెలూన్ వార్ నడుస్తోంది. ఐతే ఇప్పుడు స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడే రంగంలోకి దిగారు. డ్రాగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జో బైడెన్. తమ దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. దేశాన్ని రక్షించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారాయన. తమ జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చైనాతో పోటీపడి గెలవాలని.. అందుకు అందరం కలిసి పనిచేయాలని బైడెన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
స్టేట్ ఆఫ్ యూనియన్‌లో ప్రసంగించిన బైడెన్.. ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. చైనాతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌నూ టార్గెట్ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యుగయుగాలకు పరీక్ష అంటూ కామెంట్ చేశారు బైడెన్. తమ దేశంతో చెలగాటమాడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల అమెరికాలో చైనాకు చెందిన స్పై బెలూన్ కలకలం రేపిన విషయం తెలిసిందే. అది కనిపించిన నాలుగు రోజుల తర్వాత అమెరికా దాన్ని పేల్చివేసింది. స్పై బెలూన్ కనిపించిన నాటినుంచి అమెరికా, చైనా దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..