Japanese Man Sail Solo: తాత ధైర్యానికి సలామ్.. 83 ఏళ్ల వయసులో ఒంటరిగా సముద్రాన్ని దాటేశాడు..!

Japanese Man Sail Solo: అంతరిక్షం, సముద్ర యాత్రలపై నిత్యం ఎక్కడో ఓ చోట పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. అయితే 50ఏళ్ల వయస్సులో

Japanese Man Sail Solo: తాత ధైర్యానికి సలామ్.. 83 ఏళ్ల వయసులో ఒంటరిగా సముద్రాన్ని దాటేశాడు..!
Old Age
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 05, 2022 | 6:10 PM

Japanese Man Sail Solo: అంతరిక్షం, సముద్ర యాత్రలపై నిత్యం ఎక్కడో ఓ చోట పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. అయితే 50ఏళ్ల వయస్సులో ఓ వ్యక్తి సరికొత్త రికార్డు బ్రేక్‌ చేశాడు. ఓ పడవలో ఎటువంటి తోడు లేకుండా ఒంటరిగా నౌకాయానం చేప‌ట్టిన వృద్ధుడిగా ఆయ‌న రికార్డు సృష్టించాడు కెనిచి. మార్చి 27న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్‌కో నుంచి కెనిచ్చి త‌న ప‌డ‌వ‌లో బ‌య‌లుదేరాడు. అది కూడా పసిఫిక్‌ సముద్రంలోనే ఈ ఫీట్‌ చేశాడు.

రెండు నెల‌ల పాటు ప‌సిఫిక్ స‌ముద్రంలో ప్రయాణించిన కెనిచ్చి జ‌పాన్‌లోని షికోకు దీవుల‌కు చేరుకుని మహాసముద్రాన్ని ఒంటిరిగా జాలీగా దాటేశాడు. మహాసముద్రంలో 990 కిలోల బ‌రువు ఉన్న స‌న్‌టోరీ మెర‌మెయిడ్ బోటులో ప్రయాణం సాగించి అంతకంటే హ్యీపీగా జపాన్‌లోని షికోకు దీవులకు చేరుకున్నాడు. అయితే, ఒంటిరిగా ప్రయాణిస్తున్నాననే భయమనేదే తనకు తెలయదంటున్నాడు కెనిచి. బోటు ప్రయాణ స‌మ‌యంలో త‌న వ‌ద్ద ఉన్న శాటిలైట్ ఫోన్‌తో ప్రతి రోజు తన కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పేవాడు కెనిచి. మొత్తానికి విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకున్న కెనిచి కి.. హోగో ప్రావిన్సులోని నిషియోమియా సిటీలో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు.

కాగా, ఇలాంటి సాహస యాత్ర చేయడం కెనిచికి ఇదే మొద‌టిసారి కాదు. 1962లో తన 23 ఏళ్ల వ‌య‌సులోనే జ‌పాన్ నుంచి కాలిఫోర్నియాకు వంట‌రిగా బోటుపై వెళ్లాడట. 19 అడుగుల ప్లైవుడ్ బోటుపై 94 రోజులు ప్రయాణించాడు. ఇకపై కూడా చేస్తానని కెనిచి చెబుతున్నాడు.