Japan: అంతరిక్ష పరిశోధనా సంస్థలో అగ్ని ప్రమాదం.. లాంచ్‌ప్యాడ్‌ పైనే పేలిపోయిన రాకెట్‌..! వీడియో వైరల్‌..

|

Nov 26, 2024 | 3:35 PM

కొండ చాటున భారీ పేలుడు చోటుచేసుకొని మంటలు ఎగసిపడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఘోరమైన పేలుడు, దానికి తోడు మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అందరిలో కలకలం రేపాయి.

Japan: అంతరిక్ష పరిశోధనా సంస్థలో అగ్ని ప్రమాదం.. లాంచ్‌ప్యాడ్‌ పైనే పేలిపోయిన రాకెట్‌..! వీడియో వైరల్‌..
Japan Space Agency
Follow us on

ప్రపంచంలో అతి భారీ అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాల్లో ఒక‌టైన జపాన్‌కు మరోసారి అపజయమే ఎదురైంది. జపాన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన రాకెట్ ఇంజిన్ పరీక్ష ఘోరంగా విఫలమైంది. ఎప్సిలాన్ ఎస్ రాకెట్ ఇంజిన్ పేలిపోయి పూర్తిగా దహనమైంది. ఈ ఘటన మంగళవారం ఉదయం నైరుతి జపాన్‌లోని తనెగాషిమా స్పేస్ సెంటర్‌లో జరిగింది. మంగళవారం ఉదయం ఎప్సిలాన్‌ ఎస్‌ రాకెట్‌ ఇంజిన్‌ పేలి దహనమైపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నైరుతి జపాన్‌లోని తనెగాషిమా స్పేస్‌ సెంటర్‌లో చోటుచేసుకొన్న ఈ ప్రమాదంలో ప్రాణనష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. కొండ చాటున భారీ పేలుడు చోటుచేసుకొని మంటలు ఎగసిపడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఘోరమైన పేలుడు, దానికి తోడు మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అందరిలో కలకలం రేపాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

గత రెండేళ్ల కాలంలో రెండు సార్లు ఇలాంటి ఫెయిల్యూర్‌నే చవి చూసింది జపాన్‌. 2022 అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్ రాకెట్‌ను జ‌పాన్‌ ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. 2023 జులైలోనూ జపాన్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన ఎప్సిలాన్‌ రాకెట్ ఇంజిన్‌ పరీక్షల స‌మ‌యంలోనే పేలిపోయింది. ఖ్యుషు దీవిలో యుచినోరా స్పేస్‌ సెంటర్‌ నుంచి రాకెట్‌ ఇంజిన్‌ను పరీక్షిస్తుండగా పేలిపోయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..