PM Modi: కోట్లాది మంది హృదయాల్లో ఆయన జీవించి ఉంటారు.. మాజీ ప్రధాని షింజో అబేకు ప్రధాని మోదీ నివాళులు

|

Sep 27, 2022 | 10:13 PM

జులై 8న హత్యకు గురయ్యారు షింజో అబే. ఇవాళ ఆయన అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లుచేశారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలికేందుకు జపాన్‌కు వెళ్లారు ప్రధాని మోదీ.

PM Modi: కోట్లాది మంది హృదయాల్లో ఆయన జీవించి ఉంటారు.. మాజీ ప్రధాని షింజో అబేకు ప్రధాని మోదీ నివాళులు
Japan Pm Shinzo Abe's Funer
Follow us on

మాజీ ప్రధాని షింజో అబేకి ఘనంగా తుది వీడ్కోలు పలికింది జపాన్. టోక్యోలోని బుడోకాన్ నిప్పన్ హాల్‌‌లో ప్రభుత్వ లాంఛనాలతో అత్యంత గంభీర వాతావరణంలో అబే అంతిమ సంస్కారం జరుగుతోందిలో దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయయారు. 20 మందికి పైగా దేశాధినేతలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇందుకోసం ప్రత్యేకంగా టోక్యో వెళ్లారు. షింజో హయాంలో భారత-జపాన్ దేశాల మధ్య మైత్రీ సంబంధాలు బలోపేతమయ్యాయి. అబేతో తనకూ హృదయ పూర్వక సాన్నిహిత్యం ఉండేదని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

జులైలో జపాన్‌లోని నరా సిటీలో ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటుండగా అగంతకుడు కాల్పులు జరపడంతో మృతిచెందారు షింజో అబే. అంత్యక్రియల తర్వాత షింజో భార్య అకీ అబేని కలిసి సంతాపం తెలుపుతారు ప్రధాని మోదీ. దాదాపు 16 గంటల పాటు జపాన్‌లో ఉండే మోదీ.. ప్రస్తుత ప్రధాని కిషిదాతో బేటీ అయ్యారు. ఇరువురి మధ్య ద్వైపాక్షిక సంప్రదింపులు జరిగాయి.

అబే అంత్యక్రియల కోసం సుమారు 11 మిలియ‌న్‌ డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తోంది జపాన్ ప్రభుత్వం. టోక్యోలోని ఇంటి నుంచి షింజో అబే పార్థివ‌దేహాన్ని నిప్పాన్ హాల్‌కు త‌ర‌లించే రూట్లో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. సుమారు 20వేల మంది పోలీసుల‌తో భద్రత క‌ల్పిస్తున్నారు. అటు… రాచ‌రిక కుటుంబానికి చెందని షింజోకు రాయల్‌ స్టయిల్‌లో సెండాఫ్ ఇవ్వడం ఏంటని జపాన్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పీఎంఓ ఎదుట ఓ వ్యక్తి నిప్పంటించుకుని నిరసన తెలిపాడు కూడా.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం