Shigeru Ishiba: జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రధాని పదవికి ఇషిబా రాజీనామా
జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఈ విషయాన్ని ఇషిబా స్వయంగా ప్రకటించారు. సొంత పార్టీ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడి ఈ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచి పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగింది.

జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఈ విషయాన్ని ఇషిబా స్వయంగా ప్రకటించారు. సొంత పార్టీ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడి ఈ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచి పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఇషిబా.. ప్రధాని పదవితోపాటు.. ఎల్డీపీ ప్రెసిడెండట్ గా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంటు ఎగువసభలో మెజారిటీ కోల్పోయింది. సభలో 248 స్థానాలుండగా, వాటిలో సగం సీట్లకు జులైలో ఎన్నికలు జరిగాయి. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సభలో మెజారిటీ సాధించాలంటే 50 స్థానాలు దక్కించుకోవాలి. కానీ 47 స్థానాలకే పరిమితమైంది. గత అక్టోబరులో జరిగిన దిగువసభ ఎన్నికల్లోనూ ఈ కూటమి ఓటమి పాలైంది. 1955లో స్థాపించిన ఎల్‌డీపీ రెండు సభల్లో మెజారిటీని కోల్పోవడం ఇదే తొలిసారి.
ప్రతికూలంగా ఫలితాలొచ్చినా తాను పదవిలో కొనసాగుతానని ఇంతకు ముందు ఇషిబా తెలిపారు. కానీ ఈ ఓటమితో రాజీనామా చేయాలని లేదా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధికార కూటమిలోని ఇతర రాజకీయ పార్టీల నుంచి ఇషిబాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. షిగేరు ఇషిబా రాజీనామాతో వారసుడు ఎవరన్న దానిపై అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నది.
‘లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను చేపట్టాల్సిందిగా సెక్రటరీ జనరల్ మోరియామాను కోరాను’ అని ఇషిబా తెలిపారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, ఇషిబా జూలైలో LDP ఎగువ సభలో ఓటమితో సహా వరుస ఎన్నికల పరాజయాలను ఎదుర్కొన్నారు. వ్యయాల పెరుగుదలపై ఓటర్ల నిరాశ ఈ ఎదురుదెబ్బల వెనుక ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
