ITBP- Indo-Tibetan Border Police: 22 వేల అడుగుల ఎత్తులో యోగా.. ఐటీబీపీ జవాన్ల సాహసం

| Edited By: Shiva Prajapati

Jun 06, 2022 | 6:24 PM

ఇండియా, టిబెట్ సరిహద్దులో పహారా కాసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైనది ఐటీబీపీ దళం. భారత రక్షణ దళాల్లో ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన విభాగం. తాజాగా ఐటీబీపీ దళం అరుదైన రికార్డును సృష్టించారు..

ITBP- Indo-Tibetan Border Police: 22 వేల అడుగుల ఎత్తులో యోగా.. ఐటీబీపీ జవాన్ల సాహసం
Itbp Police
Follow us on

ఉత్తరాఖండ్‌లోని ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు ((ITBP- Indo-Tibetan Border Police) అరుదైన రికార్డు సృష్టించారు. హిమాల‌యాల్లో 22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేశారు. ఐటీబీపీలో ప‌ర్వతారోహ‌కులుగా ఉన్న సిబ్బంది ఈ ఘ‌న‌త‌ను సాధించారు. మంచు అధికంగా ఉన్నా.. ఐటీబీపీ ద‌ళాలు మాత్రం యోగా క్రియ‌ల‌ను నిర్విఘ్నంగా నిర్వహించారు. ఇటీల ఐటీబీపీ ప‌ర్వతారోహ‌కులు మౌంట్ అబి గామిన్ ప‌ర్వతంపై కూడా యోగా చేశారు. 14 మంది స‌భ్యులున్న బృందం సుమారు 20 నిమిషాల పాటు ఈ యోగా చేశారు. యోగా చేసే సమయంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో కప్పి ఉంది. ఎత్తైన పర్వతంపై మంచులో నిలబడి ‘బద్రి విశాల్ కీ జై’ అని నినాదాలతో ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అబి గామిన్ పర్వతం సెంట్రల్ హిమాలయాలలోని జస్కర్ రేంజ్‌లో ఉంటుంది. అబి గామెన్ ఈ ప్రాంతంలో ఉన్న రెండో అతిపెద్ద పర్వతం.

ఇండియా, టిబెట్ సరిహద్దులో పహారా కాసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైనది ఐటీబీపీ దళం. భారత రక్షణ దళాల్లో ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన విభాగం. ఈ విభాగంలో దాదాపు 90,000 మందికి పైగా జవాన్లు, అధికారులు పని చేస్తున్నారు. నక్సల్స్(Naxals) ప్రభావిత ప్రాంతాల్లో మోహరింపు, శాంతిభద్రతల పరిరక్షణ విధులతోపాటు హిమాలయ సరిహద్దులను రక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ ఈ దళంలో ఉంటారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదకర, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. ఎక్కువగా హిమాలయాలలో 3,000 నుంచి 18,800 అడుగుల ఎత్తులో సరిహద్దు రక్షణ విధులు నిర్వర్తిస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత -45 డిగ్రీల వరకు పడిపోతుంది.రు. దాదాపు 230 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ దళానికి పర్వతారోహణలోనూ మంచి పట్టు ఉంటుంది.