Italy: ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని.. అత్యధిక మెజారిటీతో విజయఢంకా మోగించిన ధీరవనిత!

|

Sep 27, 2022 | 1:44 PM

ఇటలీ దేశ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని (45) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన ఇటలీ ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన రైట్‌ వింగ్‌ నాయకురాలు జార్జియా మెలోని 26.37 శాతం ఓట్లతో ప్రత్యర్ధి మారియో డ్రాఘీపై ఘన విజయం సాధించారు..

Italy: ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని.. అత్యధిక మెజారిటీతో విజయఢంకా మోగించిన ధీరవనిత!
Italy first female PM Giorgia Meloni
Follow us on

Italy got its first women Prime Minister: ఇటలీ దేశ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని (45) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన ఇటలీ ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన రైట్‌ వింగ్‌ నాయకురాలు జార్జియా మెలోని 26.37 శాతం ఓట్లతో ప్రత్యర్ధి మారియో డ్రాఘీపై ఘన విజయం సాధించారు. దీంతో ఇటలీకి మొదటి మహిళా ప్రధానిగా ఆమె ఎంపికవ్వడమేకాకుండా రైట్‌ వింగ్‌ ప్రభుత్వం అమల్లోకొచ్చినట్లయ్యింది. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో ఈమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఇటలీ సెనేట్‌లో మెజారిటీ సాధించాలంటే పోటీలో ఉన్న రాజకీయ పార్టీకి 104 సీట్లు అవసరం. ఐతే ప్రధాన మంత్రి రేసులో జార్జియా మెలోని గెలుపొందినప్పటికీ, ఆమెకు పరిపాలన అనుభవం అంతగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా దేశంలో తలెత్తుతున్న ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడం అతిపెద్ద సవాలుగా పరిణమించనుంది. ధరల పెరుగుదల కారణంగా ఓ వైపు వ్యయం పెరిగిపోతుంటే, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇటలీ వార్షిక బాండ్లపై దిగుబడి 4.3%కి పడిపోతోంది. ఇది గత డిసెంబర్‌లో 1% కంటే తక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశ పగ్గాలను చేపట్టడమంటే సవాళ్లతో కూడుకున్న విషయమే అవుతుంది. ఇక రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో ఏర్పడే పూర్తి రైటిస్ట్స్‌ ప్రభుత్వం కూడా ఇదే అవుతుంది. ఐతే ఎన్నికల ప్రచార సమయంలో వివాదాస్పదమైన గాడ్‌, ఫాదర్‌ల్యాండ్‌ అండ్‌ ఫ్యామిలీ నినాదంతో మెలోని ముందుకు సాగారు. ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇటలీ నౌకాదళం లిబియా సముద్రమార్గాన్ని మూసివేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇర ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పుతిన్‌ను విమర్శించేందుకు మెలోని పెద్దగా ఆసక్తి చూపకపోవడం విశేషం. నాటోకు, ఉక్రెయిన్‌కు ఆమె నుంచి అనుకొన్న స్థాయిలో మద్దతు లభించలేదు.

కాగా, 2018లో జరిగిన ఎన్నికలలో మెలోని పార్టీ కేవలం 4 శాతం ఓట్లను మాత్రమే గెలుచుకున్నా, మూడేళ్ల కాలంలోనే అనూహ్యంగా పుంజుకుంది. అప్పట్లో మారియో డ్రాఘీ నేతృత్వంలోని కూటమిలో చేరడానికి నిరాకరించిన మెలోని, ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగారు. అక్టోబర్ 13 వరకు కొత్త పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల అనంతరం కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే అవకాశం ఉంది.