కంటికి కనిపిస్తూనే ఇట్టే ‘మాయమయ్యే’ సైనికులుంటారు జాగ్రత్త ! ఇజ్రాయెల్ లో కొత్త ప్రయోగం

| Edited By: Phani CH

Jun 30, 2021 | 6:16 PM

కంటి ముందు కనిపించే వారు ఇట్టే మాయమయ్యే దృశ్యాలను సినిమాల్లో చూస్తుంటాం.. అది కంప్యూటర్ ' మాయాజాలం' టెక్నీక్కే ..కానీ దీన్ని నిజం చేస్తూ ఇజ్రాయెల్ కొత్త ప్రయోగానికి శీకారం చుట్టింది.

కంటికి కనిపిస్తూనే ఇట్టే మాయమయ్యే సైనికులుంటారు జాగ్రత్త ! ఇజ్రాయెల్ లో కొత్త ప్రయోగం
Israel Military
Follow us on

కంటి ముందు కనిపించే వారు ఇట్టే మాయమయ్యే దృశ్యాలను సినిమాల్లో చూస్తుంటాం.. అది కంప్యూటర్ ‘ మాయాజాలం’ టెక్నీక్కే ..కానీ దీన్ని నిజం చేస్తూ ఇజ్రాయెల్ కొత్త ప్రయోగానికి శీకారం చుట్టింది. తమ రక్షణ వ్యవస్థను, సైనిక సంపత్తిని మెరుగు పరచేందుకు, పటిష్టం చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ.. సైనికులు ‘ కనబడకుండా ఉండే (అన్ డిటెక్టబుల్ లేదా అన్ విజిబుల్) సరికొత్త టెక్నాలజీని సృష్టిస్తోంది. పొలారిస్ సొల్యూషన్స్ అనే సంస్థ సహకారంతో కిట్ -300 అని వ్యవహరించే షీట్ ని రూపొందిస్తోంది. మైక్రో ఫైబర్స్, లోహాలు, పాలిమర్లను వినియోగించి ఓ వల వంటి వ్యవస్థని తాము తయారు చేసినట్టు ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. షీట్ లేదా బ్లాంకెట్ (దుప్పటి) లా ఉన్న దీని బరువు 1.1 పౌండ్లు మాత్రమేనని, కానీ దీన్ని ధరించినప్పుడు 500 పౌండ్ల బరువును కూడా మోసుకు వెళ్లవచ్చునని ఈ వర్గాలు పేర్కొన్నాయి. డబుల్ సైడెడ్ బ్లాంకెట్ లా ఉన్న దీన్ని ఓ వైపు ధరించినప్పుడు అడవుల్లోను..మరో వైపు ధరించినప్పుడు ఎడారుల్లోనూ సులభంగా వెళ్ళవచ్చునట…కంటికి కనబడకుండా చేసే ఈ విచిత్రమైన బ్లాంకెట్ ధరిస్తే ఓ రాయిలా కనబడతారని..దూరం నుంచి బైనాక్యులర్ తో చూసినా అంతేనని సోలారిస్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ట్రెక్కింగ్ (ఎత్తయిన కొండలు ఎక్కేటప్పుడు) చేసేటప్పుడు..వార్ జోన్లలోనూ ఈ విధమైన రక్షణ కవచాలు ఎంతగానో ఉపకరిస్తాయని వీరు చెబుతున్నారు. ఒక చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఇలాంటి సరికొత్త ప్రయోగాలకు చేయడం విశేషమే మరి ! కేవలం తమకున్న పరిమిత వనరులతోనే ఆ దేశం ఈ విధమైన ప్రయోగాలను చేపడుతోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Amul Milk: సామాన్యులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. జూలై 1 నుంచి వర్తింపు!

హై అలర్ట్..! జమ్మూ సిటీలో జామర్లు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు ..రాజౌరీ జిల్లాలో ఎగిరే వస్తువుల బ్యాన్