ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్(Corona Virus).. రోజుకో రూపం సంతరించుకుంటుంది. తగ్గినట్లే తగ్గి వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. ఈ వేరియంట్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి వాటి ద్వారా వచ్చే ముప్పు గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. తాగాగా కరోనా వైరస్ గురించి ఇజ్రాయెల్(Israel) సైంటిస్టులు మరో విషయాన్ని కనుగొన్నారు. కొవిడ్ త్వరలోనే మళ్లీ ఉగ్రరూపం దాల్చవచ్చని, డెల్టా వేరియంట్ లేదా మరో కొత్త వేరియంటే ఇందుకు కారణమవుతుందని హెచ్చరించారు. అంతే కాకుండా ఒమిక్రాన్ వేరియంట్ రకాలు వచ్చే రెండు మూడు నెలల్లో వాటంతట అవే కనుమరుగవుతాయని వెల్లడించారు. ఈ మేరకు బెన్-గురియన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా పరిశోధన సాగించారు. బీర్-షెవా నగరంలోని మురుగునీటిని సేకరించి చేసిన పరిశోధనలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల మధ్య పరస్పరం చర్యలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఆ ప్రకారం చూస్తే డెల్టా లేదా మరో కొత్త వేరియంట్ కారణంగా మరోసారి కొవిడ్ ఉద్ధృతి తప్పకపోవచ్చని భావిస్తున్నామని వెల్లడించారు.
కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకొచ్చినట్లు గతంలో డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. యూకేలో మొదటగా గుర్తించిన ఈ వైరస్రకం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ నుంచి ఇంకా ముప్పు పొంచే ఉందని తెలిపిన డబ్ల్యూహెచ్ఓ వైరస్ కట్టడి చర్యలను తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఇటీవల పలు దేశాల్లో టెస్టింగ్‌లు గణనీయంగా తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ..ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని సూచించింది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Russia Ukraine War: ఉక్రెయిన్ తూర్పు భాగంలో రష్యా దళాల దాడి.. డాన్‌బాస్‌లో 21 మంది పౌరుల మృతి