AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసుపత్రిపై క్షిపణి దాడి.. ‘ఖమేనీని విడిచిపెట్టం.. చంపేస్తాం’.. ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్!

ఇరాన్‌ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్‌లను తయారుచేసే కర్మాగారంపై మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్‌ సాయుధశక్తిని ధ్వంసం చేసేందుకు.. మిస్సైల్‌ ప్రొడక్షన్‌ డిఫెన్స్‌ ప్లాంట్‌లపై భీకరంగా దాడులు చేస్తోంది.

ఆసుపత్రిపై క్షిపణి దాడి.. 'ఖమేనీని విడిచిపెట్టం.. చంపేస్తాం'.. ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్!
Israel Iran War Tensions
Balaraju Goud
|

Updated on: Jun 19, 2025 | 4:52 PM

Share

ఇరాన్‌ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్‌లను తయారుచేసే కర్మాగారంపై మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్‌ సాయుధశక్తిని ధ్వంసం చేసేందుకు.. మిస్సైల్‌ ప్రొడక్షన్‌ డిఫెన్స్‌ ప్లాంట్‌లపై భీకరంగా దాడులు చేస్తోంది.

తాజాగా సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని బీర్షెబా ఆసుపత్రిపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని చంపుతామని కాట్జ్ హెచ్చరించారు. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిన కొద్దిసేపటికే కాట్జ్ ప్రకటన వచ్చింది.

ది జెరూసలేం పోస్ట్ కథనం ప్రకారం, ఆసుపత్రిపై జరిగిన దాడికి ఖమేనీ ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అన్నారు. మేము ఇప్పుడు అతనిని నేరుగా లక్ష్యంగా చేసుకుంటామని, ఇది యుద్ధ నేరం, దీనికి ఖమేనీని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ హైపర్‌సోనిక్ క్షిపణులను ఉపయోగిస్తున్న తీరు చూస్తే, అది తన కార్యకలాపాలను ఆపబోదని స్పష్టమవుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అన్నారు. మనం ఇప్పుడు ఇరాన్‌పై కొత్త మార్గంలో దాడి చేయబోతున్నామని తెలిపారు. అలీ ఖమేనీ సుల్తానేట్‌ను కదిలిస్తామని కాట్జ్ అన్నారు. ఏది ఏమైనా పర్వాలేదు. ఇజ్రాయెల్‌పై జరిగే అన్ని దాడులను సమర్థవంతంగా తిప్పికొడతామన్నారు. రక్షణ మంత్రి ప్రకటనకు ముందు, ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ దీనికి మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని అన్నారు.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై దాడులకు నిరసనగా ఇరాన్ గురువారం ఇజ్రాయెల్ ఆసుపత్రిపై దాడి చేసింది. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం, ఈ దాడిలో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20 మందికి పైగా పాక్షికంగా గాయపడ్డారు. ఇరాన్ చేసిన ఈ దాడిలో ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఆసుపత్రి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కమాండ్ ఏరియాలో ఉందని, అందుకే దాడి జరిగిందని ఇరాన్ చెబుతోంది.

ఇరాన్ ఇంటర్నేషనల్ ప్రకారం, ఇజ్రాయెల్ దాడి దృష్ట్యా, అలీ ఖమేనీ తన మొత్తం కుటుంబంతో కలిసి టెహ్రాన్‌లోని లావిజాన్ బంకర్‌లో దాక్కున్నాడు. ఈ బంకర్ అణు ప్రదేశానికి సమీపంలో ఉంది. ఇరాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం కూడా బంకర్ సమీపంలోనే ఉంది. ఖమేనీ ఇరాన్ సుప్రీం నాయకుడు మరియు సైన్యాన్ని నడిపించేది ఆయనే. బుధవారం, ఇజ్రాయెల్ దాడికి నిరసనగా ఖమేనీ ఒక ప్రకటన విడుదల చేశారు. మేము అమెరికాకు లొంగిపోబోమని ఖమేనీ అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..