Israel Hamas War: హమాస్ నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న ఇజ్రాయెల్.. గాజాలో మళ్ళీ దాడి.. 100 మంది మృతి

|

Aug 10, 2024 | 12:21 PM

ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా హమాస్ ఉగ్రవాదులతో కలిసి దాడి చేసే ప్రమాదం ఉంది. దీంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే మరోవైపు ఇజ్రాయెల్ గాజాలో వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న హమాస్ కి చెందిన వ్యక్తులపై దాడు నిర్వహిస్తూనే ఉంది. నిరంతరం గాజాపై ఇజ్రాయెల్ విరుచుపడుతోంది. తాజాగా తూర్పు గాజాలోని ఓ పాఠశాలలో తలదాచుకున్న వారిపై ఇజ్రాయెల్‌ దాడి చేసిందని అంతర్జాతీయ మీడియా ప్రకటించింది.

Israel Hamas War: హమాస్ నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న ఇజ్రాయెల్.. గాజాలో మళ్ళీ దాడి.. 100 మంది మృతి
Israel Strike On Gaza School
Follow us on

గత ఏడాది హమాస్ ఉగ్రవాదులు అకస్మాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేసి.. మరణ హోమం సృష్టించారు. కొన్ని వందల మందిని బందీలుగా తీసుకుని వెళ్ళారు. తమపై జరిగిన దాడులకు ప్రతీకార దాడులు చేస్తామని ప్రకటించింది. హమాస్‌ను భూస్థాపితం చేస్తామంటూ 10 నెలల నుంచి గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులుచేస్తూనే ఉంది. అయితే ఇటీవల హమాస్ కు భారీ దెబ్బ తగిలింది. హమాస్ తో పాటు హెజ్‌బొల్లాల కీలక నేతలు దాడుల్లో మరణించారు. దీంతో హమాస్ కు సాయంగా ఇరాన్ .. యుద్ధంలోకి దిగనున్నట్లు హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా హమాస్ ఉగ్రవాదులతో కలిసి దాడి చేసే ప్రమాదం ఉంది. దీంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే మరోవైపు ఇజ్రాయెల్ గాజాలో వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న హమాస్ కి చెందిన వ్యక్తులపై దాడు నిర్వహిస్తూనే ఉంది. నిరంతరం గాజాపై ఇజ్రాయెల్ విరుచుపడుతోంది. తాజాగా తూర్పు గాజాలోని ఓ పాఠశాలలో తలదాచుకున్న వారిపై ఇజ్రాయెల్‌ దాడి చేసిందని అంతర్జాతీయ మీడియా ప్రకటించింది.

తూర్పు గాజాలో ఓ పాఠశాలో కొంతమంది నిరాశ్రయులు తలదాచుకుంటున్నారని.. వీరిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు వంద మందికి పైగా మరణించారని.. అనేక మంది గాయపడ్డారని తెలిపింది. గత వారంలో కూడా గాజాలోని మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో 30 మంది మరణించారు. పలువురు మృతి చెందారు. ఇక ఆగష్టు 1న దలాల్ అల్-ముఘ్రాబీ స్కూల్‌పై దాడి చేయగా.. 15 మంది మృతి చెందారు.

గాజాలో హమాస్ నిర్మూలన జరిగే వరకూ తమ పోరాటం ఆపమని యుద్ధానికి తాము బయపడం అంటూ ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. అదే విధమగా గాజాలోని ఉగ్రవాదులపై విరుచుకుపడుతోంది. గాజాపై కురిపిస్తోన్న బాంబుల వర్షంతో భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీటి వ్యవస్థలు ద్వంసం అయ్యాయి. వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటీవల హమాస్‌, హెజ్‌బొల్లాల కీలక నేతల హత్యల నేపధ్యంలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి

ఇవి కూడా చదవండి

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..