Turkey earthquake: అందమైన పట్టణం.. ఆనవాళ్లే లేకుండా పోయింది.. టర్కీలో భీకర దృశ్యాలు..

సుందరమైన నగరంలో అందమైన బీచ్‌. ఇప్పుడు దిక్కు మొక్కు లేని స్థితిలో ఉంది. సరదాగా సందడిగా ఉండే సముద్ర తీరం ఇప్పుడు కళతప్పింది. భూకంపం ఆ బీచ్‌ను బలితీసుకుంది.

Turkey earthquake: అందమైన పట్టణం.. ఆనవాళ్లే లేకుండా పోయింది.. టర్కీలో భీకర దృశ్యాలు..

Updated on: Feb 15, 2023 | 11:09 PM

సుందరమైన నగరంలో అందమైన బీచ్‌. ఇప్పుడు దిక్కు మొక్కు లేని స్థితిలో ఉంది. సరదాగా సందడిగా ఉండే సముద్ర తీరం ఇప్పుడు కళతప్పింది. భూకంపం ఆ బీచ్‌ను బలితీసుకుంది. టర్కీలోని ఇస్కెన్‌డెరన్‌- ఒక అందమైన పట్టణం. మధ్యధారా సముద్రానికి ఆనుకొని విస్తరించిన పట్టణమిది. అతి పురాతనమైన నగరాల్లో ఇది ఒకటి. సముద్రాన్ని ఆనుకొని పట్టణం, దాన్ని వెనుకవైపు మబ్బులను తాకుతున్నట్టుగా ఉండే కొండలు.

కాని ఇప్పుడు ఈ నగరం శిధిలమైపోయింది. ఫిబ్రవరి 6న వచ్చిన భూకంపం ఈ నగరాన్ని సర్వనాశనం చేసింది. అందమైన భవనాలతో కనులకు ఇంపుగా నిలిచిన ఇస్కెన్‌డెరన్‌ పట్టణం ఇప్పుడు పాడుబడిపోయింది, మోడువారిపోయింది. సముద్రపు ఒడ్డున ఉన్న సుందరమైన బీచ్‌, అక్కడున్న చిల్డ్రన్‌ పార్క్‌ కళతప్పిపోయాయి. ఇప్పుడు బీచ్‌ వైపే కాదు ఊళ్లో ఎక్కడా జనం కనిపించని పరిస్థితి. భూకంపం బారిన తప్పించుకొని సజీవంగా మిగిలిన వాళ్లు బిక్కుమంటూ రోడ్లపక్కన, క్యాంపుల్లో, కార్లలో కాలం గడుపుతున్నారు. పెనువిషాదం మిగిల్చిన భూకంపం నుంచి టర్కీ ఎప్పటికి కోలుకుంటుందో.. ఎప్పుడు ఈ పట్టణం తిరిగి జీవకళ సంతరించుకుంటుందో.

ఇక హతాయ్‌లో భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. ఫిబ్రవరి 6వ తేదీ ముందు వరకు ఆలివ్‌ పంటతో పచ్చగా ఉన్న ఈ భూమి..శక్తివంతమైన భూప్రకంపనల ధాటికి రెండుగా చీలిపోయింది. 1939 అంటాక్యా భూకంపం తర్వాత భారీ నష్టాన్ని మిగిల్చాయి వరుస ప్రకంపనలు. బాంబులు విస్పోటనం చెందినట్టుగా భారీ అగాధం ఏర్పడింది. మరోవైపు రెండుగా చీలిన టర్కీ హతాయ్ ఎయిర్‌‌‌‌పోర్టులోని రన్​వేకు మరమ్మతులు చేసి విమాన సర్వీసులను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..