Bangladesh: బానిసత్వాన్ని తెంచి స్వాతంత్ర్యం ఇప్పిస్తే.. భారత్‌నే టార్గెట్ చేస్తారా?

1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వంతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు... ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేసుకోవాలిక్కడ. 'మహా అయితే ఓ 30 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉంటుంది బంగ్లాదేశ్! మరో పాకిస్తాన్‌లా బంగ్లాదేశ్ మారకపోతే చూడండి. అక్కడి మంతఛాందసవాదం భారత్ చేసిన త్యాగాన్ని మరిచిపోయేలా చేస్తుంది. ఆ విషయాన్ని భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్‌తో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి '.. అని 54 ఏళ్ల క్రితం ఆ ఆర్మీ అధికారి అన్న మాటలు ఇవాళ నిజమయ్యాయ్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టడానికి ముందు.. అక్కడి వాట్సాప్ యూనివర్సిటీల్లో చెప్పుకున్న పాఠం ఒక్కటే. 'ముజీబుర్ రెహ్మాన్ మనకి స్వాతంత్య్రం తేలేదు.. పాకిస్తాన్ నుంచి భారతే మనల్ని విడగొట్టింది' అని. షేక్ ముజీబుర్ రెహ్మాన్, షేక్ హసీనాని దేశ ద్రోహులుగా యువతరం మనసులో ముద్ర వేసేశారు. బంగ్లాదేశ్‌కి భారత్ మొదటి శత్రువు అని నూరిపోశారు. సో, అంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతూ వస్తోంది. భారత్‌పై ద్వేషం ఉంటే.. బంగ్లాలోని హిందువులనే ఎందుకు టార్గెట్ చేయాలి? ఎక్కడ టచ్ చేస్తే భారత్ రియాక్ట్ అవుతుందో తెలుసు కాబట్టి. బంగ్లాదేశ్‌లో ఓ భారత వ్యతిరేకిని చంపేస్తే.. అందుకు ప్రతీకారంగా హిందువులను చంపుతున్నారంటే... బంగ్లాదేశ్ ఓ క్లియర్ సిగ్నల్ పంపిస్తోందనే అర్ధం. పాకిస్తాన్-చైనా అండ చూసుకుని.. రెచ్చిపోతోందని తెలుస్తూనే ఉంది. బట్.. ఇక్కడ తెలియాల్సింది బంగ్లాదేశ్‌లో ఈ మార్పు ఎక్కడ, ఎందుకు, ఎలా మొదలైందనేదే. భారత్‌పై అంతగా విషం కక్కడానికి కారణం ఏంటనేదే. బంగ్లాదేశ్‌లో ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతోందో చెప్పుకుంటూనే ఈనాటి పరిస్థితికి కారణమైన చరిత్రను కూడా చెప్పుకుందాం

Bangladesh: బానిసత్వాన్ని తెంచి స్వాతంత్ర్యం ఇప్పిస్తే.. భారత్‌నే టార్గెట్ చేస్తారా?
Bangladesh Unrest

Updated on: Dec 23, 2025 | 9:45 PM

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ISI సెల్ ఓపెన్ అయింది. పాకిస్తాన్‌లో ఉండాల్సిన అక్కడి ఆర్మీ మేజర్స్, కల్నల్స్, బ్రిగేడియర్స్… ఇవాళ ఢాకాలో తిష్ఠవేశారు. ఏం పని వాళ్లకి? మొన్న నవంబర్‌లో కొలంబోలో జరిగిన మీటింగ్‌ అజిత్ ధోవల్ ఈ విషయమే అడిగారు. ఢాకాలో ISI సెల్ పెట్టడమేంటని. పిచ్చి సమాధానం చెప్పి ఊరుకుంది బంగ్లాదేశ్. బట్.. భారత్‌కు విషయమేంటో అర్ధమైంది. విచిత్రమేంటో గానీ.. భారత్‌పై విషం చిమ్ముతున్న వాళ్లు ఒక్కొక్కరుగా చనిపోయారు. ఒకరిద్దరు చనిపోతే యాధృచ్చికం. బై యాక్సిడెంట్ చనిపోతే కాకతాళీయం. కాని, 40 మంది చనిపోతే…! వారం క్రితం ఉస్మాన్ హాదీని చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. హాదీ చనిపోయాకే హిందువులపై దాడులు జరుగుతున్నాయి, పెరుగుతున్నాయి అనుకుంటారు. కాదు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి జరగని జిల్లా అంటూ లేదు. హిందూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు లెక్కే లేదు. అలా చేస్తున్నందుకే 40 మంది చనిపోయారు. కాకపోతే హాదీ మరణంతో హిందువులపై దాడులు ఈ ప్రపంచానికి తెలిసిందంతే. బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నాయ్. కాదేమో.. ఈ స్టేట్‌మెంట్‌ను ఇలా ఇవ్వకూడదేమో. హిందువులే టార్గెట్‌గా బంగ్లాదేశ్‌లో మూక దాడులు జరుగుతున్నాయ్ అనాలేమో. ఇందాక వచ్చిన క్వశ్చనే. హిందువులనే ఎందుకు టార్గెట్ చేయాలి? అంటే.. పాకిస్తాన్ హస్తం ఉందా? చైనా వెనకుండి నడిపిస్తోందా? ఊరికే అనుమానాలు వ్యక్తం చేస్తే ఎలా? ఏదో ఒక ప్రూఫ్ ఉండాలిగా. ఇదిగో ప్రూఫ్.. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ మంత్రులంతా ఒకచోట చేరి.. మీటింగ్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి