Ireland Man: 7 నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిన యువకుడు.. తిరిగి ఇంటికి వస్తే గుర్తు పట్టలేక షాక్ తిన్న కుటుంబ సభ్యులు.. ఎందుకంటే

|

Nov 28, 2022 | 5:04 PM

తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా ఉండి బరువు తగ్గాలని బ్రియాన్ నిర్ణయించుకున్నాడు. కష్టమైన ప్రయాణాన్ని ఏడు నెలల క్రితం ప్రారంభించాడు. ఇప్పుడు బ్రియాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఫిట్ బాడీతో జీవితాన్ని గడుపుతున్నాడు.

Ireland Man: 7 నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిన యువకుడు.. తిరిగి ఇంటికి వస్తే గుర్తు పట్టలేక షాక్ తిన్న కుటుంబ సభ్యులు.. ఎందుకంటే
Bryan O Keeffe
Follow us on

ఓ యువకుడు ఏడు నెలలుగా ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. తాను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ చెప్పలేదు. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతని కుటుంబ సభ్యులు అతని రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ కొడుకేనా అని ఆలోచించారు.. ఒకప్పుడు భయంకరమైన స్థూలకాయంతో ఉన్న తన కొడుకుని ఏడు నెలల తర్వాత అతని కుటుంబ సభ్యులు కూడా గుర్తించలేకపోయారు. ఈ ఘటన ఐర్లాండ్ లో చోటు చేసుకుంది.  152 బరువున్న 34 ఏళ్ల బ్రియాన్ కేవలం ఏడు నెలల్లో తన బరువును తగ్గించుకుని 63 కిలోలకు వచ్చేశాడు. అందంగా స్మార్ట్ గా ఉన్న తమ కుమారుడిని చూసి తల్లిదండ్రులు మాత్రమే కాదు మొత్తం కుటుంబ సభ్యలు షాక్ తిన్నారు. ఆ యువకుడు తన బరువు తగ్గించే ప్రయాణానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

బ్రియాన్..  గత 15 సంవత్సరాలుగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ విజయం సాధించలేదు. నన్ను బాధించలేరు అనే పుస్తకాన్ని చదివిన తరువాత..  కుటుంబం, స్నేహితులు తన బలహీనత అని బ్రియాన్. గ్రహించాడు.  అందుకనే తన అత్యధిక బరువును తగ్గించుకోవాలని నయా ప్రయత్నం చేయాలని భావించాడు. అందుకనే తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా ఉండి బరువు తగ్గాలని బ్రియాన్ నిర్ణయించుకున్నాడు. కష్టమైన ప్రయాణాన్ని ఏడు నెలల క్రితం ప్రారంభించాడు. ఇప్పుడు బ్రియాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఫిట్ బాడీతో జీవితాన్ని గడుపుతున్నాడు.

ఇవి కూడా చదవండి

 

బ్రియాన్ స్పెయిన్ వెళ్ళాడు. అక్కడికి చేరుకోగానే కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలు తెంచుకున్నాడు. 7 నెలల పాటు తన బరువుని తగ్గించుకుని ఫిట్ నెట్ సాధించడంపై మాత్రమే దృష్టి పెట్టాడు. 2021 లో థాంక్స్ గివింగ్ రోజున ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. 63 కిలోలున్న బ్రియాన్ ను చూసి ఇంటి సభ్యుల రియాక్షన్ చూడాల్సిందే.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో కుటుంబ సభ్యుల షాకింగ్ రియాక్షన్ చూడాల్సిందే. బ్రియాన్‌ను చూసిన కుటుంబ సభ్యులు ఏడు నెలల క్రితం తమకు తెలిసిన బ్రియాన్‌నేనా అని ఆలోచించడం ప్రారంభించారు.

రోజులో 5 గంటల వ్యాయామం:
బ్రియాన్ బరువు తగ్గడానికి ఆరు నెలల డైట్ ప్లాన్ పాటించాడు. ఇందులోభాగంగా, అతను 5 నెలల పాటు 2200 కేలరీలున్న ఆహారాన్ని తీసుకున్నాడు.  తర్వాత ఆరో నెల.. 1750 కేలరీలున్న ఆహారాన్ని తీసుకున్నారు. రోజూ 5 గంటలు వ్యాయామం చేసేవాడు. అందులో పరుగు కూడా ఉంది. బ్రియాన్ మాట్లాడుతూ ఈ ఏడు నెలల కాలంలో ఒక్క రోజూ కూడా తాను వ్యాయామానికి సెలవు ఇవ్వలేదని చెప్పాడు. తాను డైట్ ప్లాన్, వ్యాయామం చేసే సమయంలో చాలా బాధపడినట్లు.. అయినప్పటికీ వ్యాయామం వదిలిపెట్టలేదని గుర్తు చేసుకున్నాడు. మొదటి రెండు వారాలు తాను సుమారు గంటన్నర పాటు నడిచేవాడినని చెప్పాడు. దీని తర్వాత వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నాడు బ్రియాన్.

మొదటి మూడు నెలల్లో, బ్రియాన్ తినడం, నిద్రపోవడం, వ్యాయామం చేయడం తప్ప మరేమీ చేయలేదు. సమతుల్య ఆహారం, నిర్ణీయ శారీరక శ్రమతో పాటు మంచి నిద్ర తీసుకున్నాడు. ఈ ఏడు నెలల్లో తాను అల్జీమర్స్‌తో బాధపడుతున్న తన స్నేహితుడితో, తన తండ్రితో మాత్రమే మాట్లాడానని బ్రియాన్ చెప్పాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..