Gulf Indian Goods: నూపుర్ శర్మ వ్యాఖ్యల ఎఫెక్ట్.. కువైట్ సూపర్ మార్కెట్‌లో ఇండియన్ ప్రొడక్ట్స్ బహిష్కరణ..!

|

Jun 07, 2022 | 6:01 AM

Gulf Indian Goods: నూపుర్‌ శర్మ వ్యాఖ్యలు గల్ప్‌లో మంటలు రేపాయి. కువైట్‌ సూపర్‌ మార్కెట్లలో ఇండియన్‌ ప్రొడక్ట్స్‌ తొలగించారు. ప్రవక్త మహ్మద్ బీజేపీ అధికార ప్రతినిధి

Gulf Indian Goods: నూపుర్ శర్మ వ్యాఖ్యల ఎఫెక్ట్.. కువైట్ సూపర్ మార్కెట్‌లో ఇండియన్ ప్రొడక్ట్స్ బహిష్కరణ..!
Indian Goods
Follow us on

Gulf Indian Goods: నూపుర్‌ శర్మ వ్యాఖ్యలు గల్ప్‌లో మంటలు రేపాయి. కువైట్‌ సూపర్‌ మార్కెట్లలో ఇండియన్‌ ప్రొడక్ట్స్‌ తొలగించారు. ప్రవక్త మహ్మద్ బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు గల్ఫ్‌ దేశాల్లో కలకలం రేపాయి.. ఈ అంశంపై సౌదీ అరేబియా, ఖతర్, ఇరాన్, కువైట్ దేశాలు మన దేశాన్ని భారత రాయబారులను పిలిచి తమ నిరసన వ్యక్తం చేశాయి.. ఇండియాలో ఇస్లాం పట్ల ద్వేషం తేటతెల్లమైందని ఇస్లామిక్ సహకార సంస్థ-ఐఓసీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఇప్పటికే తప్పి కొట్టింది. కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ అభిప్రాయాలుగా పరిగణించవద్దని స్పష్టం చేశారు మన విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖతర్‌ పర్యటనలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు భారత్‌కు ఇబ్బందిని కలిగించాయి.

మరోవైపు గల్ఫ్‌ దేశాల్లో భారత వస్తువులను బహిష్కరించాలని సోషల్‌ మీడియాలో ఇచ్చిన పిలుపు ప్రభావం అక్కడి సూపర్‌ మార్కెట్ల మీద పడింది. కువైట్‌లోని పలు సూపర్‌ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులను తొలగించేశారు. భారత్‌ నుంచి దిగుమతైన బియ్యం బస్తాలు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలను ప్లాస్టిక్‌ షీట్లతో కప్పేశారు.. ‘మేం భారతీయ ఉత్పత్తులను తొలగించాం’ అంటూ అరబిక్‌ భాషలో నోటీసులను అతికించారు. భారత్‌లో ఇస్లామిక్‌ ఫోబియో పెరుగుతోందని, ప్రవక్తను అవమానించడాన్ని తాము అనుమతించబోమని అక్కడి అధికారులు తెలిపారు.

భారత్‌ – గల్ఫ్‌ దేశాల మధ్య ఏటా 189 బిలియన్‌ డాలర్ల మేర వినియోగ వస్తువుల వ్యాపారం సాగుతుంది. ఆ దేశాల ప్రజల ఆగ్రహం ఈ వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఏర్పడింది. భారతీయ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.