Tharman Shanmugaratnam: సింగపూర్ 9వ అధ్యక్షుడిగా గెలుపొందిన భారత సంతతి థర్మన్‌ షణ్ముగరత్నం

|

Sep 02, 2023 | 8:55 AM

సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త థర్మన్‌ షణ్ముగరత్నం (66) విజయబావుటా ఎగురవేశారు. ఏకంగా 70.4 శాతం మెజారిటీతో సింగపూర్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్ధులపై భారీగా ఓట్లు సాధించి ఆయన గెలుపొందారు. 2011 తర్వాత ఆ దేశంలో తొలిసారిగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా సంతతి నాయకులైని ఇద్దరు పోటీదారులు..

Tharman Shanmugaratnam: సింగపూర్ 9వ అధ్యక్షుడిగా గెలుపొందిన భారత సంతతి థర్మన్‌ షణ్ముగరత్నం
Tharman Shanmugaratnam
Follow us on

సింగపూర్‌, సెప్టెంబర్ 2: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త థర్మన్‌ షణ్ముగరత్నం (66) విజయబావుటా ఎగురవేశారు. ఏకంగా 70.4 శాతం మెజారిటీతో సింగపూర్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్ధులపై భారీగా ఓట్లు సాధించి ఆయన గెలుపొందారు. 2011 తర్వాత ఆ దేశంలో తొలిసారిగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా సంతతి నాయకులైని ఇద్దరు పోటీదారులు ఎన్‌జి కోక్ సాంగ్, తాన్ కిన్ లియాన్‌లను ధర్మన్ షణ్ముగరత్నం ఓడించారు. వీరిద్దరు వరుసగా 15.7 శాతం, 13.88 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగారు.

అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన థర్మన్ షణ్ముగరత్నంను సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ అభినందనలు తెలిపారు. సింగపూర్ వాసులు తమ ఓటు ద్వారా తదుపరి అధ్యక్షుడిగా థర్మన్ షణ్ముగరత్నంను ఎంచుకున్నారు. దేశాధినేతగా అటు స్వదేశంలో, ఇటు విదేశాల్లోనూ మాకు ప్రాతినిధ్యం వహిస్తారని విశ్వసిస్తున్నాను. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్ధులకు నేను కృతజ్ఞతలు తెల్పుతున్నాను. ఎన్నికల్లో ఓటర్లు, పోటీదారులు గొప్ప అవగాహనను కనబరిచారు. ఇది సింగపూర్ దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది అని ప్రధాని లీ హ్సీన్ లూంగ్ అన్నారు.

థర్మన్ షణ్ముగరత్నం మీడియాతో మాట్లాడుతూ.. తనకు మద్దతుతెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ వాసులు తనపై ఉంచిన నమ్మకానికి వినయపూర్వకంగా ఉంటానన్నారు. ఇది తనకు విజయం మాత్రమేకాదు సింగపూర్ భవిష్యత్తు అన్నారు. సింగపూర్ వాసులు తనపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తానన్నారు. నాకు ఓటు వేయని వారితో సహా సింగపూర్ పౌరులందరినీ గౌరవిస్తానని ధర్మన్ షణ్ముగరత్నం మీడియా సమావేశంలో తెలిపారు. కాగా తమిళనాడు సంతతికి చెంచిన షణ్ముగరత్నం సింగపూర్‌లో జన్మించారు. 2001లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి పలు కీలకపదవుల్లో పనిచేశారు. తాజా ఎన్నికల్లో షణ్ముగరత్నం సింగపూర్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుత సింగపూర్ అధ్యక్షుడిగా ఉన్న హలిమా యాకోబ్‌ పదవీ కాలం సెప్టెంబర్‌ 13తో ముగియనున్నది. అనంతరం ధర్మన్ షణ్ముగరత్నం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఆరేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.