Arora Akanksha: ఐక్యరాజ్య సమితి చీఫ్ బరిలో భారత సంతతి మహిళ.. ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంటున్న మన ‘ఆకాంక్ష’

|

Feb 14, 2021 | 4:15 AM

United Nations: ఐక్యరాజ్య సమితి అత్యున్నత పదవికి భారత సంతతి మహిళ పోటీపడుతున్నారు. ఐరాస జనరల్ సెక్రటరీ పదవికి తాను పోటీ పడుతున్నట్లు అరోరా ఆకాంక్ష (34) వెల్లడించారు. త్వరలో జరిగే..

Arora Akanksha: ఐక్యరాజ్య సమితి చీఫ్ బరిలో భారత సంతతి మహిళ.. ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంటున్న మన ‘ఆకాంక్ష’
Follow us on

United Nations: ఐక్యరాజ్య సమితి అత్యున్నత పదవికి భారత సంతతి మహిళ పోటీపడుతున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ పదవికి తాను పోటీ పడుతున్నట్లు అరోరా ఆకాంక్ష (34) వెల్లడించారు. త్వరలో జరిగే సెక్రటరీ జనరల్‌ ఎన్నికల బరిలో ఉంటానని ఆకాంక్ష తెలిపారు. భారత సంతతికి చెందిన ఆరోరా ఆకాంక్ష ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) కింద అడిట్ కో – ఆర్డినేటర్‌గా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో సెక్రటరీ జనరల్ పదవికి తాను పోటీపడనున్నట్లు వెల్లడిస్తూ.. ‘AroraForSG’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు.
ఈ క్రమంలో ఆమె ఓ వీడియోను సైతం షేర్ చేశారు.

ఐక్యరాజ్య సమితి 75 సంవత్సరాలుగా..ప్రపంచానికి ఇచ్చిన వాగ్దానాలను ఐరాస నెరవేర్చలేకపోయింది. శరణార్థులకు రక్షణ కల్పించలేదు. మానవాళికి అందించే సాయం కూడా అంతంత మాత్రంగానే ఉందని.. నూతన ఆవిష్కరణలు, సాంకేతికత విషయంలో ఇంకా వెనకనే ఉందని.. పురోగతి కోసం పోటీలో నిలువనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఐక్య రాజ్యసమితి ఏర్పాటు గురించి కూడా ప్రస్తావించారు.

ప్రస్తుతం ఐరాస సెక్రటరీ జనర‌ల్‌గా ఆంటోనియో గుటెర్రస్ (71) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31తో ఆయన పదవీ కాలం ముగియనుంది. తదుపరి ఎస్‌జీ పదవీకాలం జనవరి 1, 2022 నుంచి ప్రారంభం కానుంది. అయితే తాను రెండో దఫా ఆ బాధ్యతలు నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్లు గుటెర్రస్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆకాంక్ష ఈ ప్రకటన చేశారు.

కాగా.. ఐక్యరాజ్య సమితి 75 ఏళ్ల ఐరాస చరిత్రలో ఇంతవరకు ఒక మహిళ కూడా ఆ పదవిని చేపట్టలేదు. ఒకవేళ ఆకాంక్ష ఈ పదవిని చేపడితే.. చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టిస్తారు. భారత్‌కు చెందిన ఆకాంక్ష.. కెనెడియన్‌ పాస్‌పోర్టుపై.. ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియాగా కొనసాగుతున్నారు. టొరంటోలోని యార్క్‌ వర్సిటీ నుంచి పరిపాలన శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకొని.. కొలంబియా వర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు.


Also Read:

AI Technology: అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం.. వ్యతిరేకిస్తున్న ప్రపంచ దేశాలు.. కారణమేంటంటే..

Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేయని అధికారులు..