AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యూనిచ్‌లో భారత్ శాంతి మార్చ్.. శాంతి, న్యాయం కోసం కదం తొక్కిన ప్రవాస భారతీయులు

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జర్మనీలోని సెంట్రల్ మ్యూనిచ్‌లో దాదాపు 700 మంది భారతీయ సమాజం సభ్యులు శాంతియుతంగా నిరసన తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ నిరసన LMU సమీపంలోని చారిత్రాత్మక గెష్విస్టర్-స్కోల్-ప్లాట్జ్ వద్ద ప్రారంభమై ముంచ్నర్ ఫ్రీహీట్ వద్ద ముగిసింది.

మ్యూనిచ్‌లో భారత్ శాంతి మార్చ్.. శాంతి, న్యాయం కోసం కదం తొక్కిన ప్రవాస భారతీయులు
Bharat Peace March In Munich
Balaraju Goud
|

Updated on: May 06, 2025 | 7:49 PM

Share

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జర్మనీలోని సెంట్రల్ మ్యూనిచ్‌లో దాదాపు 700 మంది భారతీయ సమాజం సభ్యులు శాంతియుతంగా నిరసన తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ నిరసన LMU సమీపంలోని చారిత్రాత్మక గెష్విస్టర్-స్కోల్-ప్లాట్జ్ వద్ద ప్రారంభమై ముంచ్నర్ ఫ్రీహీట్ వద్ద ముగిసింది, పహల్గామ్ బాధితులకు సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ బలమైన సందేశాన్ని పంపింది.

ఈ నిరసనకు పార్లమెంటు సభ్యుడు ప్రొఫెసర్, ప్రముఖ జర్మన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హాన్స్ థీస్, మ్యూనిచ్ నగర కౌన్సిలర్ డెలిజా బలిడెమాజ్ వంటి ప్రముఖ జర్మన్ రాజకీయ ప్రముఖుల మద్దతు పలికారు. ఉగ్రవాదాన్ని ఖండించడానికి, అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ప్రదర్శనకారులతో పాటు నిలిచారు. డాక్టర్ థీస్ బాధితుల కోసం ప్రార్థనలు చేస్తూ, ఉగ్రవాదం, మతపరమైన తీవ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తూ తీవ్ర భావోద్వేగ సందేశాన్ని ఇచ్చారు. భారతీయ డయాస్పోరా చొరవను ఆయన ప్రశంసించారు. నేరస్థులను న్యాయం ముందు నిలబెట్టాలి. అదే సమయంలో, రెండు అణ్వాయుధ దేశాలు భారత్-పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తతను నివారించడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. బాధితులతో అండగా నిలబడతామని అన్నారు.

పహల్గామ్ దాడిపై ఆగ్రహించిన భారతీయ సమాజాల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మ్యూని‌చ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల యూరప్ అంతటా భారతీయ సమాజ సమూహాలు ఇలాంటి ప్రదర్శనలను నిర్వహించాయి. హింసాకాండలో ప్రభావితమైన వారితో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తూ, ఐక్యతను వ్యక్తం చేస్తున్నాయి.

Bharat Peace March At Munich

Bharat Peace March At Munich

చిల్డ్రన్స్ పార్క్ వద్ద జరిగిన ఈ సమావేశంలో పెద్ద ఎత్తున జనం చేరుకుని భారత్‌కు మద్దతుగా శాంతి, ఐక్యత, న్యాయం యొక్క నినాదాలు చేశారు. బాధితులను, వారి కుటుంబాలను గౌరవించడానికి ఒక నిమిషం పాటు హృదయ విదారకంగా మౌనం పాటించారు. తరువాత భారత జాతీయ గీతం జన గణ మనను సామూహికంగా ఆలపించారు. పహల్గామ్ విషాదాన్ని ఎదుర్కొవడానికి భారతీయ ప్రవాసుల బలం, ఐక్యతను ప్రదర్శించారు. “ఇది కేవలం శాంతి యాత్ర కాదు, ఇది న్యాయం కోసం సమిష్టి నినాదం” అని ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులలో ఒకరైన శోభిత్ సరిన్ అన్నారు. “పహల్గామ్‌లో తమ గొంతులు వినిపించిన వారి కోసం, శాంతి, న్యాయం, మానవ జీవిత గౌరవాన్ని విశ్వసించే ప్రతి భారతీయుడి కోసం మేము కవాతు చేసామన్నారు. “ఉగ్రవాదానికి మన ప్రపంచంలో స్థానం లేదు” అని శివాంగి కౌశిక్, దివ్యభ్ త్యాగి అన్నారు. “మనం ఒక్కటిగా ఎదుగుతున్న కొద్దీ భారతదేశం ఐక్యంగా బలంగా నిలుస్తుంది.” అని అన్నారు.

మరోవైపు, మే 3న, మిలన్‌లోని డుయోమో సమీపంలోని పియాజ్జా ఫోంటానాలో 100 మందికి పైగా నిరసనకారులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సిక్కు, క్రైస్తవ, తమిళ, మలయాళీ వర్గాల సభ్యులు, అలాగే భారతీయ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ దాడిని ఖండించిన భారతీయులు, కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద ముప్పుపై ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని పిలుపునిచ్చింది. సంఘీభావం, కరుణ కోసం నిర్వహించిన శాంతియుత మార్చ్ కేవలం ప్రతీకాత్మక సంజ్ఞ కాదని, ఇది న్యాయం కోసం పిలుపుగా, ఉగ్రవాద దాడిని తిరస్కరించడానికి, శాంతియుత భవిష్యత్తు కోసం డిమాండ్‌ అన్నారు.

వీడియో చూడండి… 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..