అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి మొదటిసారిగా చుక్కెదురు, ఉన్నత స్థాయి పోస్టుకు ఇండో-అమెరికన్ నియామకం రద్దు

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి మొదటిసారిగా చుక్కెదురైంది. వైట్ హౌస్ లో ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ గా ఇండియన్-అమెరికన్ నీరా టాండెన్  నియామకాన్ని వైట్ హౌస్ ఉపసంహరించింది.

  • Umakanth Rao
  • Publish Date - 1:00 pm, Wed, 3 March 21
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి మొదటిసారిగా చుక్కెదురు, ఉన్నత స్థాయి పోస్టుకు ఇండో-అమెరికన్ నియామకం రద్దు

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి మొదటిసారిగా చుక్కెదురైంది. వైట్ హౌస్ లో ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ గా ఇండియన్-అమెరికన్ నీరా టాండెన్  నియామకాన్ని వైట్ హౌస్ ఉపసంహరించింది. అత్యంత శక్తిమంతమైన బడ్జెట్ విభాగానికి డైరెక్టర్ వంటి ఉన్నత స్థాయి పదవిని ఆమె కోల్పోయింది. ఇండియన్-అమెరికన్లలో బైడెన్ సూచించిన వ్యక్తుల్లో ఇలా పోస్టును కోల్పోయిన తొలి  ఆసియన్ మహిళ అయింది. రిపబ్లికన్ ఎంపీలను అదేపనిగా సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తూ వచ్చిన  నీరా టాండెన్ బహుశా ఈ కారణంవల్లే పోస్టును దక్కించుకోలేకపోయినట్టు తెలుస్తోంది. విపక్ష రిపబ్లికన్లను టార్గెట్ చేస్తూ ఈమె అనేకసార్లు లోగడ చేసిన పోస్టుల కారణంగా తాము ఈమె నియామకాన్ని వ్యతిరేకిస్తున్నామని జో మెంచెస్ అనే సెనెటర్ గతనెలలోనే స్పష్టం చేశారు. అప్పటి నుంచే ఈమెకు ‘గ్రహణం’ ప్రారంభమైంది. అయితే నీరా స్వయంగా అధ్యక్షుడు బైడెన్ కి లేఖ రాస్తూ తన నియామక ప్రతిపాదనను తానె ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొంది. ఇతర ప్రయారిటీల నుంచి పక్కకు మళ్లాలని తాను అనుకోవడంలేదని తెలిపింది.

డెమొక్రాట్ అయిన ఈమెకు ఆసియన్ అమెరికన్ కమ్యూనిటీ యాక్టివిస్టుల నుంచి,  యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా మద్దతు ఉంది.  50-50 సభ్యుల సెనేట్ లో కనీసం ఒక రిపబ్లికన్ ఓటు అవసరమవుతుంది. కానీ మరో ముగ్గురు సెనేటర్లు కూడా ఈమె నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు.  నీరా టాండెన్ నియమాకాన్ని సెనెట్ తిరస్కరించడం బైడెన్ కి పెద్ద దెబ్బే అని భావిస్తున్నారు. తన నియామకాన్ని ఉపసంహరించాలన్న ఈమె అభ్యర్థనను తాను అంగీకరిస్తున్నట్టు బైడెన్ పేర్కొన్నారు. తన ట్వీట్లలో  నీరా ముఖ్యంగా రిపబ్లికన్ సెనేటర్లను ఉద్దేశించి చులకనగా, హేళనగా ట్వీట్లు చేస్తూ వచ్చిందని తెలుస్తోంది. తనకు ఈ పోస్టు లభించకపోయినా  తన పంథా వీడబోనని ఈమె అంటోంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

మూడవ అంతస్తు నుండి పిల్లల్ని కిటికీలోంచి ప‌డేసిన త‌ల్లి! Mother Throwing Children Out The Window Viral Video.

మంత్రిగారి డర్టీ పిక్చర్..బయటపడిన మినిష్టర్ అశ్లీల ఫోటోలు, వీడియోలు : Karnataka Minister Private Video