Kandahar Plane Hijacker: కాందహార్ విమాన హైజాక్ ఘటనలో కీలక హైజాకర్ ఒకరు హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్‌లోని కరాచీలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైజాకర్లలో ఒకరైన జహూర్ మిస్త్రీ అలియాస్ జాహిద్ అఖుంద్ హత్య చేయబడ్డాడు. పాకిస్తాన్ ఆర్థిక రాజధానిగా పరిగణించబడే కరాచీ నగరంలో మార్చి 1 న జాహిద్ హత్యకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగనట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని నిఘా వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. టూ వీలర్‌పై వచ్చిన ఓ వ్యక్తి జహూర్ మిస్త్రీపై కాల్పులు జరిపినట్లుగా సమీపంలోని సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది. కరాచీలో జరిగిన అఖుంద్ అంత్యక్రియలకు రవూఫ్ అస్గర్‌తోపాటు జైషే మహ్మద్ అగ్రనేతలు కూడా హాజరయ్యారని నిఘా వర్గాలు కూడా టీవీ9కి తెలిపాయి. జైషే చీఫ్ మసూద్ అజర్ సోదరుడు, జైషే ఆపరేషనల్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు.
జాహిద్ అఖుంద్ అనే కొత్త గుర్తింపుతో జహూర్ మిస్త్రీ గత కొన్ని సంవత్సరాలుగా కరాచీలో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. కరాచీ కేంద్రంగా భారీ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు జహూర్ మిస్త్రీ. అఖుంద్ కరాచీలోని అక్తర్ కాలనీలో ఉన్న క్రెసెంట్ ఫర్నిచర్ యజమాని.
కరాచీకి చెందిన వ్యాపారవేత్త హత్యను జియో టీవీ ధృవీకరించింది. అయితే, అతని పేరు లేదా వ్యక్తిని ఏ ఉద్దేశ్యంతో హత్య చేశారు? ఈ విషయాల గురించి సమాచారం ఇవ్వలేదు. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా జియో టీవీ విడుదల చేసింది. దీంతో ఉగ్రవాది జహూర్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది.
హైజాక్ ఎలా జరిగింది?
1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ814 నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ నుంచి లఖ్‌నవూకు ప్రయాణం ప్రారంభించింది. అందులో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు. మీడియా కథనాల ప్రకారం ఆ విమానం భారత గగనతలంలోకి రాగానే ముసుగు ధరించిన ఓ మిలిటెంట్ కాక్‌పిట్ వైపు వెళ్లాడు. విమానాన్ని లాహోర్‌కు తీసుకువెళ్లాలని, లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని పైలట్‌ను బెదిరించాడు.
ఆ వెంటనే ముసుగులు ధరించిన మరో నలుగురు మిలిటెంట్లు సీట్లలో నుంచి లేచి, విమానంలోని నాలుగు వేర్వేరు చోట్ల నిల్చున్నారు.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War: పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన వాహనదారులు.. భారత్‌ను తాకిన యుద్ధం సెగ..