రాబోయే 10, 20 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా వేగంగా అభివృద్ధి చెందుతుందని చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్ మార్టిన్ వోల్ఫ్ వ్యాఖ్యానించారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా మాట్లాడిన మార్టిన్ వోల్ఫ్.. భారతదేశ ఆర్థిక వృద్ధి అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. ‘చాలా కాలంగా భారతదేశ ఆర్థిక గమనాన్ని పరిశీలిస్తున్నాను. ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది నిజంగా అద్భుతమైన అంశం. రాబోయే 10-20 సంవత్సరాలలో ఖచ్చితంగా ఆర్థికంగా అగ్రదేశాల లిస్ట్‌లో చేరుతుంది. వ్యాపారం, ఇతర రంగాల బిజినెస్‌లో లేని వారు భారతదేశం ఆర్థిక వృద్ధిని అంచనా వేయలేరు. ప్రపంచంలో భారత్ స్థానం ఏంటో వారు అర్థం చేసుకోలేరు. చూస్తూ ఉండండి. భారత్ అనతి కాలంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.’ అని మార్టిన్ వోల్ఫ్ తెలిపారు.
ఇక ప్రపంచ బ్యాంకు సీనియర్ ఆర్థికవేత్త ధృవ్ శర్మ ప్రకారం.. డిసెంబరులో ప్రపంచ బ్యాంక్ భారతదేశ 2022-23 జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.5 శాతం నుండి 6.9 శాతానికి సవరించింది. ఇక FY21-22లో భారత వృద్ధిరేటు 8.7 శాతానికి అంచనా వేశారు. ‘భారతదేశం 10 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు మరింత స్థితిస్థాపకంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా తీసుకున్న అన్ని చర్యలు భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా మారడంలో సహాయపడుతుంది.’ అని ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధృవ్ శర్మ అన్నారు. కరోనా సంక్షోభం తరువాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పుంజుకుంటోందన్నారు శర్మ.
Exactly right!
Over the next 10-20 years, it is overwhelmingly certain that India will be the fastest-growing economy.– Martin Wolf, Chief economics commentator at the Financial Times
— Erik Solheim (@ErikSolheim) January 20, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..