S-400 Missile System: భారత్‌తో ఎస్-400 క్షిపణి డీల్‌.. రష్యాపై అమెరికా కన్నెర్ర..!

|

Jan 30, 2022 | 9:10 AM

ఇండియాతో అమెరికా ఫ్రెండ్‌షిప్‌ చేస్తూనే.. మరోవైపు మిత్రదేశాలతో కొత్త గొడవలు పెట్టుకుంటోంది. మనకు సాయం చేస్తున్న దేశాలపై US గుర్రుగా ఉంది.

S-400 Missile System: భారత్‌తో ఎస్-400 క్షిపణి డీల్‌.. రష్యాపై అమెరికా కన్నెర్ర..!
Us India
Follow us on

US Serious on Russia Over India Deal: ఇండియాతో అమెరికా ఫ్రెండ్‌షిప్‌ చేస్తూనే.. మరోవైపు మిత్రదేశాలతో కొత్త గొడవలు పెట్టుకుంటోంది. మనకు సాయం చేస్తున్న దేశాలపై అమెరికా(USA) గుర్రుగా ఉంది. ఎందుకంటే.. భారత్‌(India)కు ఎస్-400 క్షిపణి(S-400 Missile System) రక్షణ వ్యవస్థలను విక్రయించినందుకు రష్యాపై ఆగ్రహంగా ఉంది. ఈ ప్రాంతాన్ని అస్థిర పరిచేందుకు రష్యా ప్రయత్నిస్తోందని విమర్శించింది. తన ఆదాయాన్ని పెంచుకునేందుకు భారత్‌కు క్షిపణి రక్షణ వ్యవస్థను విక్రయించిన రష్యాపై అమెరికా విరుచుకు పడడం ఇది రెండో సారి.

ఆ ప్రాంతంలోను, వెలుపల అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేస్తోందని విమర్శించింది. ఐదు ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుకు 2018లో భారత్‌, రష్యాల మధ్య 500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్‌ ముందడుగు వేసింది.ఎస్‌-400 వ్యవస్థ విషయంలో మాకున్న ఆందోళనల్లో ఏ మాత్రం మార్పు లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తాజాగా పేర్కొన్నారు.

రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేయరాదని అన్ని దేశాలనూ కోరుతున్నామన్నారు. అయితే ఎస్‌-400 విషయంలో వెనక్కి తగ్గని భారత్‌పై క్యాట్సా చట్టం కింద ఆంక్షలు విధించడంపై అమెరికా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై తాము ఒక నిర్ణయానికి రాలేదని నెడ్‌ చెప్పారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చి స్పందించారు. తమది స్వతంత్ర విదేశీ విధానమని స్పష్టం చేశారు. తాము చేపట్టే ఆయుధ కొనుగోళ్లకూ ఇది వర్తిస్తుందన్నారు. ఈ విషయంలో జాతీయ భద్రతా ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

Read Also….  కరోనా ఎఫెక్ట్ ..భారీగా తగ్గిన జననాలు.. పెరిగిన మరణాలు..జనాభా సంక్షోభంలో ఆ దేశం.. పిల్లల్ని కనండి మహాప్రభో అంటున్న ప్రభుత్వం