PM Modi UNGA: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్‌లో ప్రధాన నరేంద్రమోదీ శనివారం ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి భారత్ ఓ తల్లిలాంటిదని అన్నారు. ప్రజాస్వామ్యానికి తల్లిగా పిలువబడే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని పేర్కొన్నారు. ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిందని, మన వైవిధ్యం మన బలమైన ప్రజాస్వామ్యానికి గుర్తింపు అని మోదీ అన్నారు. డజన్ల కొద్ది భాషలు, వందలాది మాండలికాలు, విభిన్న జీవనశైలి, వంటకాలు తదితరాలు ప్రజాస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణ అని మోదీ అన్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడానికి భారత్ ఎంతో కృషి చేసిందని, కరోనాను అరికట్టేందుకు భారత్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. కరోనా మహమ్మారి కాలంలో దశల వారిగా నిలదొక్కుకోగలిగిందన్నారు. కాగా, ప్రధాని మూడు రోజుల పర్యటన సందర్భంగా బుధవారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. కోవిడ్19 మహమ్మారి తర్వాత మోదీ చేసిన తొలి పర్యటన ఇది.
అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కోవిడ్-19 తర్వాత వాషింగ్టన్‌లో జరిగిన తొలి క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం భారత్‌లో పెట్టుబడుల కోసం ఐదుగురు గ్లోబర్ సీఈవోలతో గురువారం సమావేశం నిర్వహించారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో శుక్రవారం తొలిసారి ముఖా ముఖి భేటీ అయిన విషయం తెలిసిందే. అఫ్గానిస్థాన్‌లో పాలనను చేజిక్కించుకున్న తాలిబన్లు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని భారత్, అమెరికా సూచించాయి. మహిళలు, చిన్నారులు సహా పౌరుల హక్కులను గౌరవించాలని హితవు పలికాయి. అఫ్గాన్‌ను ఉగ్రవాదుల శిక్షణకు స్థావరంగా మార్చవద్దని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని తేల్చి చెప్పాయి. ఇతర దేశాలకు ముప్పు తలపెట్టే శక్తులకు అఫ్గాన్ భూభాగాన్ని కేంద్రంగా మార్చవద్దని సూచించాయి. బైడెన్‌తో తొలిసారి భేటీ అయిన మోదీ.. పలు అంశాలపై చర్చించిన వారు అఫ్గాన్‌లో ఉగ్రవాదంపై ప్రధానంగా ప్రస్తావించారు.
కాగా, ఉగ్రమూకలకు నిధులు అందజేత విషయంలో అడ్డుకోవాలని భారత్, అమెరికా స్పష్టం చేశాయి.
ఉగ్రవాద నిర్మూలనకు తాలిబన్ ప్రభుత్వం కృషి చేయాలని భారత్-అమెరికా పేర్కొన్నాయి. అలాగే అఫ్గానిస్థాన్‌ను వీడాలనుకుంటున్న అఫ్గాన్లు, విదేశీయులను సురక్షితంగా పంపాలని, అఫ్గానిస్థాన్‌కు మానవతా దృక్పథంతో అందే సాయాన్ని తాలిబన్లు అనుమతించాలని హితవు పలికాయి.
Essential to ensure Afghanistan territory not used to spread terrorism: PM Modi at UNGA
Read @ANI Story | https://t.co/z71vG5D9LD#PMModiUSVisit #PMModiatUNGA #UNGA pic.twitter.com/mbYA9rpbNX
— ANI Digital (@ani_digital) September 25, 2021
India known as mother of democracy: PM Modi at UNGA
Read @ANI Story | https://t.co/zrceR53U0v#PMModiUSVisit #UNGA #PMModi pic.twitter.com/k2ZC58JONW
— ANI Digital (@ani_digital) September 25, 2021