Sri Lanka Crisis: శ్రీలంకకు మరోసారి సాయం చేసిన భారత్.. భారీగా వైద్య సామాగ్రి అందజేత..

|

Jun 04, 2022 | 7:23 PM

శ్రీలంక దేశ ప్రజల అవసరాలను తీర్చడం కోసం మొదట స్పందించింది భారతదేశం. తన వంతు సాయంగా అత్యవసర పదార్ధాలను పంపిస్తోంది. తాజాగా శ్రీ‌లంక‌కు భారీగా అత్యవ‌స‌ర వైద్య సామ‌గ్రిని పంపింది.

Sri Lanka Crisis: శ్రీలంకకు మరోసారి సాయం చేసిన భారత్.. భారీగా వైద్య సామాగ్రి అందజేత..
Bharat Srilanka
Follow us on

Sri Lanka Crisis: శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతోంది. ఆ దేశ ప్రజలు కనీస అవసరాలు కూడా దొరకడం లేదంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు కూడా చేశారు.. అయితే పొరుగు దేశం శ్రీలంక తీవ్ర సంక్షోభంలో ఉంటే .. భారతదేశం (India) స్నేహ హస్తాన్ని అందించటమే కాదు.. ఆ దేశ ప్రజల అవసరాలను తీర్చడం కోసం మొదట స్పందించింది భారతదేశం. తన వంతు సాయంగా అత్యవసర పదార్ధాలను పంపిస్తోంది. ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది. గోధుమలు,  ఆహారం, మందులు, పెట్రోల్, బియ్యం, పాల పౌడ‌ర్, కిరోసిన్ వంటి ఇతర నిత్యావసరమైన వస్తువులను అందించిన భారత్ మళ్ళీ శ్రీలంకను వైద్య పరంగా ఆదుకోవడానికి ముందుకొచ్చింది. మన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్ (Minister Jaishankar) ఆ దేశ పర్యటన సందర్భంగా అక్కడ వైద్య సామాగ్రి కొరత ఉన్నట్లు గుర్తించారు. దీంతో  తాజాగా  శ్రీ‌లంక‌కు భారీగా అత్యవ‌స‌ర వైద్య సామ‌గ్రిని పంపింది.

సువాసేరియా అంబులెన్స్ సర్వీస్‌కు ఎమర్జెన్సీ   3.3 ట‌న్నుల మెడికల్ సామాగ్రిని అందించామని.. ఇక దేశంలోని  ప‌లు ఆసుప‌త్రుల‌కు అద‌నంగా వైద్య సామ‌గ్రిని భార‌త్ అందించిన‌ట్లు గోపాల్ బాగ్లే పేర్కొన్నారు. మార్చి నెలలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్ శ్రీలంక రాజధాని కొలంబోలోని సువాసేరియాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మెడికల్ వస్తువుల కొరత ఉందని తెలుసుకున్నార‌ని గోపాల్ బాగ్లే తెలిపారు. దీంతో  భార‌తీయ నౌక ఘ‌రియ‌ల్ ద్వారా.. భారత్..  శ్రీలంక దేశానికి భారీ సంఖ్యలో వైద్య సామాగ్రిని పంపినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ శ్రీలంకకు  రూ. 7.96 కోట్ల విలువజేసే 25 ట‌న్నుల మందులు వైద్య సామాగ్రి భారత్ పంపించింది. ఇక మరోసారి ఈ సంక్షోభ సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని, సాయాన్ని కొనసాగిస్తామని భారత్‌ స్పష్టం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.