India – China Border Dispute: సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత.. భారత్, చైనా సైనికులకు గాయాలు
భారత్-చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు వివాదంపై తొమ్మిదోసారి చర్చలు జరుగుతున్న సమయంలోనే..
India China LAC Face Off: భారత్-చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు వివాదంపై తొమ్మిదోసారి చర్చలు జరుగుతున్న సమయంలోనే డ్రాగన్ మరోసారి రెచ్చిపోవడంతో భారత బలగాలు ధీటైన సమాధానమిచ్చాయి. భారత్ – చైనా సరిహద్దుల్లోని ఎల్ఏసీ వెంబడి చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో 20మంది చైనా సైనికులు గాయపడగా, నలుగురు భారత జవాన్లకు గాయాలయ్యాయి. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. లఢఖ్ సరిహద్దుల్లో భూ వివాదంపై భారత్-చైనా ఉన్నతాధికారుల మధ్య తొమ్మిదోసారి చర్చలు జరుగుతుండగానే డ్రాగన్ రెచ్చిపోవడంతో భారత అధికారులు లఢఖ్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించారు.