WHO Top Scientist: 75 ఏళ్లలో భారత ప్రపంచంలో నెంబర్ 1 ఫార్మాగా ఖ్యాతి.. కరోనాని ఎదుర్కొన్న తీరుపై సైంటిస్ట్ సౌమ్య ప్రశంసలు

|

Oct 04, 2021 | 5:39 PM

WHO Top Scientist: భారత దేశం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గత 75 ఏళ్లలో సాధించిన అతి పెద్ద విజయాల్లో ఒకటి ఫార్మసీ రంగంలో ప్రపంచంలోనే భారత్‌ నెం.1గా..

WHO Top Scientist: 75 ఏళ్లలో భారత ప్రపంచంలో నెంబర్ 1 ఫార్మాగా ఖ్యాతి.. కరోనాని ఎదుర్కొన్న తీరుపై సైంటిస్ట్ సౌమ్య ప్రశంసలు
Who Top Scientist Soumya
Follow us on

WHO Top Scientist: భారత దేశం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గత 75 ఏళ్లలో సాధించిన అతి పెద్ద విజయాల్లో ఒకటి ఫార్మసీ రంగంలో ప్రపంచంలోనే భారత్‌ నెం.1గా ఖ్యాతిగాంచడమని  ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. స్వస్త్‌ భారత్‌, సంపన్న్‌ భారత్‌’ కార్యక్రమంలో పాల్గొన్న సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. భారతీయ ఫార్మసీ ప్రతిగతిపై ప్రశంసలను కురిపించారు. అంతేకాదు భారత దేశం పోలియోతో పాటు మరికొన్ని వైరస్‌లకు వ్యాక్సిన్‌తో అడ్డుకట్ట వేయడం, మాతా శిశు మరణాలను తగ్గించడంతో పాటు యూనివర్శల్‌ హెల్త్‌ కవరేజ్‌తో భారత్‌ ప్రపచంలోనే అత్యుత్తమ ఫార్మసీగా మారిందని అన్నారు. కొవిడ్‌ -19 మహమ్మారి భారత్‌ సహా పలు దేశాల్లో అత్యవసర ఆరోగ్య సేవలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు.

భారత దేశం ప్రసూతి, పిల్లల ఆరోగ్య సేవలను అందించడంలో ,  క్షయ తో పాటు ఇతర వ్యాధులకు చికిత్సను అందించడంలో విఫలమైందని ఈ సందర్భంగా చెప్పారు. ఇతర అత్యవసర ఆరోగ్య సేవలలో రాజీ పడకుండా భారత్ ఎదుర్కోవాలని డాక్టర్ స్వామినాథన్ అన్నారు. థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న వేళ.. రాబోయే నెల్లల్లో మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని.. పిల్లల్లో పౌష్టికాహారలోపం సమస్యపై దృష్టి పెట్టాలని సూచించారు.

ముఖ్యంగా భారత దేశంలో ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడుతున్నారని యునిసెఫ్‌ ప్రకటించింది. ఇక కొవిడ్‌తో ఈ సమస్య అధికమైందని స్వామినాథన్‌ హెచ్చరించారు. కరోనా వలన లక్షలాది కుటుంబాలు పేదరికంలోకి వెళ్లిపోయాయని.. దీంతో పౌష్టికాహారలోపం సమస్య మరింత తీవ్రమైందని చెప్పారు.  ఈ సమాచారంపై విశ్లేషణ చేపట్టాలని.. చిన్నారులు క్షయతో పాటు పేదరికానికి సంబంధించిన వ్యాధుల నుండి రక్షించేందుకు నిపుణులు ముందస్తు చర్యలను చేపట్టాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు.

Also Read:  మీరు తినే పదార్ధాల్లో ఈ తొమ్మిది ఆహారాలని చేర్చుకోండి.. సహజంగా ప్లేట్ లెట్స్ ను పెంచుకోండి