Killing Stone: బద్దలైన పిశాచాలు నివాసముండే ‘కిల్లింగ్ స్టోన్’… అరిష్టమని హడలిపోతున్న జనం

|

Mar 09, 2022 | 2:11 PM

Killing Stone: ఆధునిక దేశమైన.. అభివృద్ధి చెందుతున్న దేశమైనా ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉంటాయి. విద్యావంతులైనా సరే.. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అందుకు మినహాయింపు ఎవరూ కాదని మరో సారి..

Killing Stone: బద్దలైన పిశాచాలు నివాసముండే కిల్లింగ్ స్టోన్... అరిష్టమని హడలిపోతున్న జనం
'killing Stone' Splits In J
Follow us on

Killing Stone: ఆధునిక దేశమైన.. అభివృద్ధి చెందుతున్న దేశమైనా ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉంటాయి.  విద్యావంతులైనా సరే.. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అందుకు మినహాయింపు ఎవరూ కాదని మరో సారి ఈ సంఘటన రుజువు చేస్తోంది. టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే జపాన్(Japan) నెంబర్‌ వన్‌ అని చెప్పొచ్చు. ఒక రకంగా టెక్నాలజీ(technology) పరంగా ప్రపంచ దేశాలకు మార్గదర్శి జపాన్‌. అయితే అక్కడి ప్రజలు ఎంత విద్యావంతులో.. అంతే మూఢమతులని చెప్పక తప్పదు. ఎందుకంటే అక్కడి ప్రజలు మూఢనమ్మకాలను బాగా విశ్వసిస్తారనడానికి ఉదాహరణే ఈ సంఘటన. జపాన్ లోని నాసు ప్రాంతంలో ఓ కిల్లింగ్ స్టోన్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ శిలలో ఓ దెయ్యం కాపురం ఉంటుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ మృత్యు శిలను వారు సెషో-సెకి అని పిలుస్తారు. అయితే, ఏం జరిగిందో తెలియదు కానీ… మార్చి 6న ఆ కిల్లింగ్ స్టోన్ కాస్తా ముక్కలైపోయింది. దాంతో స్థానికులు హడలిపోతున్నారు. ఆ పురాతన శిల ఇలా బద్దలవడం అరిష్టమంటున్నారు.

జపాన్ పురాణాల ప్రకారం… సెషో-సెకి శిలను తాకినవాళ్లు చనిపోతారట. దానిని చూడడం కూడా అరిష్టమే అంటున్నారు స్ధానికులు. ఆ శిలలో తొమ్మిది తోకల నక్క రూపంలో ఉండే పిశాచి నివసిస్తుంటుందని జపాన్‌పురాణం చెబుతుందట. ఆ మాయలమారి నక్క అందమైన సుందరాంగిలా మారి టోబా చక్రవర్తిని అంతమొందించడానికి కుట్ర పన్నిందని, అయితే యుద్ధంలో సుందరాంగి తమామో ఓడిపోవడంతో ఆమె ఆత్మ మృత్యుశిలలో చిక్కుకుపోయిందని చెబుతారు. కాగా ఈ శిల నాసు ప్రాంతంలోని అగ్నిపర్వతాల మధ్యలో ఉంటుంది. 1957 నుంచి ఇది చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అసలు, ఆ మృత్యు శిలను పగిలి ముక్కలైన స్థితిలో చూడడం కూడా అశుభమేనని ఓ జపాన్ నెటిజన్ అంటున్నాడు. కాగా, జపాన్ కు చెందిన ఓ వెబ్‌సైట్‌ కథనం ప్రకారం మాత్రం వర్షం, ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడం వలనే ఆ రాయి పగుళ్లు వచ్చి ముక్కలై ఉంటుందని తెలిపింది.

Also Read:

తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన కేటుగాడు.. కంపెనీలో పనిచేస్తూ రూ. 5 కోట్లు స్వాహా..