‘గుర్తుతెలియని ఆపరేషన్స్‌’.. ఒక్కొక్కరుగా ఖతం..! కలుపు మొక్కలను ఏరేస్తున్నదెవరో?

మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టులను కంటికి రెప్పలా కాపాడడమే పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ పని. వీళ్లు డెన్‌ వదిలి బయటి ప్రపంచంలోకి రావాలంటే.. ముందుగా పాక్‌ ఐఎస్‌ఐకి చెప్పాలి. ఆ అధికారులు ప్రతి 5 కిలోమీటర్లకు స్పెషల్‌ సెక్యూరిటీ కల్పిస్తారు. వాళ్లు క్లియరెన్స్ ఇస్తేనే.. ఆ టెర్రరిస్ట్‌ కాన్వాయ్ ముందుకు వెళ్తుంది. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉందనిపిస్తే.. కాన్వాయ్‌ని సేఫ్‌ షెల్టర్‌ వైపు తిప్పేస్తారు. అలాంటి వారు ఒక్కొక్కరి లెక్క తేలుస్తన్నారు ‘‘గుర్తు తెలియని వ్యక్తులు..’’

గుర్తుతెలియని ఆపరేషన్స్‌.. ఒక్కొక్కరుగా ఖతం..! కలుపు మొక్కలను ఏరేస్తున్నదెవరో?
Jammu Kashmir Terror Attacks

Edited By: Anand T

Updated on: May 21, 2025 | 9:52 PM

పాకిస్తాన్‌లో టెర్రరిస్టులకు ఏ లెవెల్‌ సెక్యూరిటీ ఉంటుందంటే.. ఇప్పుడు చెప్పేది ఆల్‌మోస్ట్‌ సినిమాల్లోనే చూసుంటారు, బట్ సినిమా స్టోరీ కాదు. రియల్‌గా ఇలాగే జరుగుతుంది. అబు కతల్‌ అని ఓ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ ఉన్నాడు. హఫీజ్ సయీద్ మేనల్లుడు ఇతను. ఇలాంటి మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టులను కంటికి రెప్పలా కాపాడడమే పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ పని. వీళ్లు డెన్‌ వదిలి బయటి ప్రపంచంలోకి రావాలంటే.. ముందుగా పాక్‌ ఐఎస్‌ఐకి చెప్పాలి. ఆ అధికారులు ప్రతి 5 కిలోమీటర్లకు స్పెషల్‌ సెక్యూరిటీ కల్పిస్తారు. వాళ్లు క్లియరెన్స్ ఇస్తేనే.. ఆ టెర్రరిస్ట్‌ కాన్వాయ్ ముందుకు వెళ్తుంది. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉందనిపిస్తే.. కాన్వాయ్‌ని సేఫ్‌ షెల్టర్‌ వైపు తిప్పేస్తారు. ఇలాంటి సేఫ్ షెల్టర్లు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. అలా.. ఆ ఉగ్రవాది ప్రయాణం మొదలైనప్పటి నుంచి అతను ఎక్కడికి వెళ్లాలనుకున్నాడో అక్కడికి వెళ్లేంత వరకు సెక్యూరిటీ కల్పిస్తూ వెళ్తారు. ఆ ఉగ్రవాది దరిదాపుల్లోకి ఎవరు వెళ్లాలన్నా.. పాకిస్తాన్‌ ఆర్మీ కల్పించే సెక్యూరిటీని దాటుకుని వెళ్లాలి. అలాంటిది.. ఓ నలుగురు వ్యక్తులు ఆ టెర్రరిస్ట్‌ గ్రూప్‌లోకి చొరబడి సెమీ ఆటోమాటిక్ గన్స్‌తో గుళ్ల వర్షం కురిపించారు. ఖతమ్. అబు కతల్‌ అనే మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ మరుసటి రోజు హెడ్‌లైన్‌ ఏంటంటే.. ‘గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో తీవ్రవాది హతం’. ఇంతవరకే బయటకు వస్తుంది తప్ప ఆ గుర్తు తెలియని వ్యక్తులెవరో తెలీదు....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి