అమెరికాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ చేరుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి అవమానం జరిగింది. విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు అమెరికన్ మంత్రులెవరూ రాలేదు. అక్కడి పాక్ దౌత్యాధికారులు, మరికొంతమంది ఉన్నతాధికారులు మాత్రమే ఆయనకే వెల్ కమ్ చెప్పారు. పైగా తాను బస చేసిన హోటల్ కు ఇమ్రాన్ మెట్రోలోనే ప్రయాణించవలసి వచ్చింది. ఇక వాషింగ్టన్ లోనే.. కేపిటల్ వన్ ఎరేనా లో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు.. బెలూచిస్తాన్ కు చెందిన కొందరు పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆయన స్పీచ్ ని అడ్డుకున్నారు. ‘ నయా పాకిస్తాన్ ‘ అంటూ ఆయన ప్రసంగం మొదలు పెట్టగానే వారు గట్టిగా నినాదాలు చేయడంతో ఆయన షాక్ తిన్నారు. తమ దేశ ప్రయోజనాలకు అమెరికా విలువనివ్వడంలేదని, ఈ దేశానికి ఇమ్రాన్ రావడం వల్ల ఫలితమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. బెలూచిస్తాన్ లోని ముతాహిదా క్వాస్మీ , ఇతర మైనారిటీ గ్రూపులవారు కూడా ఇమ్రాన్ అమెరికా పర్యటన పట్ల నిరసన వ్యక్తం చేశారు. . అయితే పాక్ మీడియా ఈ నిరసనలను పట్టించుకోకుండా.. ఆయన ప్రసంగానికి, అమెరికా పర్యటనకు ప్రాధాన్యమిచ్చాయి. ఇమ్రాన్ విజిట్ తో పాక్-అమెరికా సంబంధాలు బలోపేతమవుతాయని పేర్కొన్నాయి. అటు-ఇమ్రాన్ తన ప్రసంగంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రపంచాన్నే డామినేట్ చేసిందని ప్రశంసించారు. వారి సిస్టం పూర్తిగా మెరిట్ పై ఆధారపడి ఉందన్నారు.
#WATCH Baloch activists disrupt Pakistan PM Imran Khan's speech during a community event in Washington DC, USA. pic.twitter.com/S9xdXF1yt8
— ANI (@ANI) July 22, 2019