Pakistan: పన్నులు చెల్లించకపోతే.. ఓటు హక్కు కోల్పోతారు.. దుమారం రేపుతున్న ఇమ్రాన్ ఆర్ధిక సలహాదారు హెచ్చరిక!

|

Nov 09, 2021 | 9:59 AM

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు షౌకత్ తరీన్ చేసిన ప్రకటన ఆ దేశంలో దుమారం రేపింది. దేశంలో ఆదాయపు పన్ను, జీఎస్టీ చెల్లించని వారికి ఓటు హక్కు కూడా రాదని తరిన్ అంటున్నారు.

Pakistan: పన్నులు చెల్లించకపోతే.. ఓటు హక్కు కోల్పోతారు.. దుమారం రేపుతున్న ఇమ్రాన్ ఆర్ధిక సలహాదారు హెచ్చరిక!
Pakistan
Follow us on

Pakistan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు షౌకత్ తరీన్ చేసిన ప్రకటన ఆ దేశంలో దుమారం రేపింది. దేశంలో ఆదాయపు పన్ను, జీఎస్టీ చెల్లించని వారికి ఓటు హక్కు కూడా రాదని తరిన్ అంటున్నారు. షౌకత్ గత నెల వరకు దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు, కానీ అతను సెనేట్‌కు ఎన్నిక కాలేకపోవడంతో, అతను పదవీవిరమణ చేయవలసి వచ్చింది. దీనితరువాత ఇమ్రాన్ అతనిని రాత్రికి రాత్రే తన ఆర్థిక సలహాదారుని చేశారు.

పన్ను కట్టకపోతే ఓటు హక్కు ఉండదు..

రాజధాని ఇస్లామాబాద్‌లో ఒక సైనిక కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు షౌకత్ తరీన్ పాల్గొన్నారు. ఈ సమయంలో, ఆయన వ్యాపారవేత్తలను హెచ్చరించారు. పాకిస్తాన్లోని వ్యాపారవేత్తలందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ”ప్రతి వ్యాపారి పన్ను చెల్లించాలి. పన్ను చెల్లించకుంటే వారికి ఓటు హక్కు ఉండదు. ఆదాయపన్ను, జీఎస్టీ ఇస్తే మిగిలిన పన్ను మినహాయించుకోవచ్చు. ఇప్పుడు మేము పన్ను చెల్లించమని ప్రజలను అడుక్కోము. చిన్న, మధ్యతరహా వ్యాపారులు, ఐటీ రంగాల వారి వద్ద డబ్బులు లేకుంటే ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది” అంటూ ప్రకటించారు.

ఐఎంఎఫ్ తో వ్యవహరించలేని కారణంగా..

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా కష్టతరమైన దశను ఎదుర్కొంటోంది. గత నెల వరకు షౌకత్ తరిన్ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అతని సోదరుడు జహంగీర్ తారిన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి. షౌకత్ గత నెలలో పెద్ద ప్రతినిధుల బృందంతో న్యూయార్క్ వెళ్లారు. అక్కడ ఐఎంఎఫ్ బోర్డుతో 11 రోజుల పాటు చర్చలు జరిపారు. అయినప్పటికీ, వారు పాకిస్తాన్‌కు 6.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీని మినహాయించి మొదటి విడత కూడా పొందలేకపోయారు. ఆ తర్వాత సెనేట్‌ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆర్థిక మంత్రి కుర్చీ కూడా దూరమైంది. ఇమ్రాన్ అతన్ని ఆర్థిక సలహాదారుని చేశాడు.

మూడేళ్లలో నలుగురు ఆర్థిక మంత్రులు

ఇమ్రాన్ ఖాన్ 2018లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన నలుగురు ఆర్థిక మంత్రులను మార్చారు. నలుగురూ అతని సన్నిహిత మిత్రులు. షౌకత్ తరీన్, అతని సోదరుడు జహంగీర్ తరీన్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల పాక్‌లోని కొందరి పేర్లు పండోర పేపర్లలో ప్రత్యక్షమయ్యాయి. వాటిలో షౌకత్, అతని సోదరుడు జహంగీర్ పేర్లు ఉన్నాయి. పండోర పేపర్స్ ప్రకారం, షౌకత్ పేరు మీద నాలుగు కంపెనీలు రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. అదేవిధంగా అవి అన్నీ ఇతర దేశాలలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: Changing Rules: మారుతున్న రూల్స్..ఇకపై వస్తువుల ప్యాకేజీలపై ఎమార్పీతో పాటు దానిని కూడా చెప్పాల్సిందే!

Low Blood Pressure: మీకు తెలుసా? లోబీపీ కూడా స్ట్రోక్‌కు కారణం అవుతుంది.. జాగ్రత్తలు తప్పనిసరి!

Health: మీకు తెలుసా ఇంట్లో ఉపయోగించే బొమ్మలు-ఫర్నిషింగ్ మెటీరియల్స్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి..ఎలాగంటే..