అమెరికా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నిస్తా… మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు యత్నిస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్ ను తాము మళ్ళీ దక్కించుకుంటామని, అలాగే సెనేట్ ని కూడా స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పారు.
అమెరికా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు యత్నిస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్ ను తాము మళ్ళీ దక్కించుకుంటామని, అలాగే సెనేట్ ని కూడా స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పారు. శనివారం ఓహియోలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్…..2022 లో జరిగే మధ్యంతర ఎన్నికలకు ఈ ఈవెంట్ తన మొదటి ర్యాలీ అని అభివర్ణించారు. గత జనవరిలో జోబైడెన్ అధ్యక్షుడైన తరువాత పదవి నుంచి దిగిపోయిన ట్రంప్… భారీ ర్యాలీలను నిర్వహించలేదు. ఆయన ప్రసంగాలు పరిమితంగానే ఉంటూ వచ్చాయి. ట్విటర్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాలు తనను బహిష్కరించిన అనంతరం ఆయన తన సొంత ‘ట్విటర్’ పైనే ఆధారపడుతున్నారు. మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయా అని ఆయన నిన్నటి ఓహియో ర్యాలీలో ప్రశ్నించగా వస్తాయంటూ వేలమంది కేకలు పెట్టారు. తన 91 నిముషాల ప్రసంగంలో ట్రంప్..హిల్లరీ క్లింటన్, నాన్సీ పెలోసి వంటి తన డెమొక్రటిక్ ప్రత్యర్థులపై విరుచుకపడ్డారు.
ఫేక్ న్యూస్ మీడియాను అపహాస్యం చేశారు. జనవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలవ లేదని, తనే విజయం సాధించానని ట్రంప్ మళ్ళీ చెప్పుకున్నారు. ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందన్న తన ఆరోపణను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ…ఆ కోర్టును చూసి సిగ్గు పడుతున్నానని పేర్కొన్నారు. ఎన్ని ఆధారాలు చూపినా ఏ కోర్టు కూడా వాటిని విశ్వసించలేకపోయిందని వాపోయారు. అయితే మళ్ళీ జరిగే ఎన్నికల్లో తన సత్తా చూపుతానని, అప్పుడు తిరిగి తనను అధ్యక్షునిగా ప్రజలు చూస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. కాగా అమెరికాలో ఇప్పటికీ వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు ఉన్నారు. కొందరు ఆయనను ఇంకా అధ్యక్షునిగానే భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ… బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి
12-18 ఏళ్ళ మధ్య వయస్సు వారికి త్వరలో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్… సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం