Chanel Show Video: చానెల్‌ షో ప్రారంభించిన తొలి ఇండియన్‌ మోడల్‌ భవిత.. వీడియో వైరల్

న్యూయార్క్ నగరంలో మాథ్యూ బ్లేజీ నిర్వహించిన చానెల్ మెటియర్స్ డి'ఆర్ట్ 2026 షోతో.. భవిత మాండవ (25) అనే తెలుగు అమ్మాయి ఓవర్‌ నైట్‌ స్టార్ అయిపోయింది. మెటియర్స్ డి'ఆర్ట్ 2026 షో ఆమె వాక్‌తో ప్రారంభమైంది. గ్రాండ్ రన్‌వేపై నడిచిన మొట్టమొదటి భారత మోడల్‌గా భవిత నిలిచింది..

Chanel Show Video: చానెల్‌ షో ప్రారంభించిన తొలి ఇండియన్‌ మోడల్‌ భవిత.. వీడియో వైరల్
Model Bhavitha Mandava At Chanel Show

Updated on: Dec 14, 2025 | 10:14 AM

హైదరాబాద్, డిసెంబర్‌ 14: న్యూయార్క్ నగరంలో మాథ్యూ బ్లేజీ నిర్వహించిన చానెల్ మెటియర్స్ డి’ఆర్ట్ 2026 షోతో.. భవిత మాండవ (25) అనే తెలుగు అమ్మాయి ఓవర్‌ నైట్‌ స్టార్ అయిపోయింది. మెటియర్స్ డి’ఆర్ట్ 2026 షో ఆమె వాక్‌తో ప్రారంభమైంది. గ్రాండ్ రన్‌వేపై నడిచిన మొట్టమొదటి భారత మోడల్‌గా భవిత నిలిచింది. బోవరీ స్టేషన్ మెట్లు దిగుతున్న భవిత వీడియోను చూస్తూ ఆమె తల్లిదండ్రులు భావోధ్వేగానికి గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇందుకు సంధించిన వీడియోను భవిత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో భవిత తల్లిదండ్రుల రియాక్షన్‌ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె తల్లి ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కూతురు భవిత పేరు పిలుస్తూ కనిపించింది. ఇక ఈ వీడియోకు టాలీవుడ్‌ తారలు సైతం ఫిదా అయ్యారు. పూజా హెగ్డే, రియా కపూర్, అదితి రావు హైదరి వంటి ప్రముఖులు హార్ట్‌ ఎమోజీలు ఇవ్వడంతో ఈ వీడియో వేగంగా వైరల్ అయింది. ఈ వీడియోకు భవిత క్యాప్షన్‌గా.. ‘ఇది నాకు ఎంత అర్థమైందో మాటల్లో చెప్పలేను. చానెల్‌ డైరెక్టర్‌ మాథ్యూ బ్లేజీకి ధన్యవాదాలు’ అంటూ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ నుంచి హాట్ కౌచర్ వరకు భవిత ప్రయాణం ఇలా..

ఈ షో తర్వాత భవిత ఫ్యాషన్ కంటెంట్ సృష్టికర్త డిలన్ కెల్లీతో కలిసి ‘వాక్ విత్ అస్’ వీడియోలో కనిపించింది. ఈ వీడియోలో ఆమె తన ప్రయాణం గురించి వెల్లడించింది. డైలాన్ ఆమెను ఛానల్ ప్రారంభించిన మోడల్ అని పరిచయం చేసింది. ఈ వీడియోలో తన మోడలింగ్ కెరీర్ ఎలా ప్రారంభమైందో వెల్లడిస్తూ.. నేను అట్లాంటిక్ అవెన్యూలో దొరికిపోయాను. ఒక స్కౌట్ నన్ను ఆపి నువ్వు మోడల్ చేస్తావా? అని అడిగాడు. నో అని అన్నాను. కానీ అతను మోడలింగ్‌ సమర్థవంతంగా చేయగలనని అతను నాకు చెప్పాడు. సరే, ప్రయత్నిద్దామని అన్నాను. ఆ సమయంలో మోడలింగ్‌ అంటే ఏమిటో నాకు తెలియదు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఫ్యాషన్, కోచర్‌ అర్ధాలు కూడా తెలియదు. నేను తిరిగి కాలేజ్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఎంత షో అనేది అర్థమైంది. అందరూ ‘నువ్వు బొట్టెగా షోలో పాల్గొన్నావా?’ అని అన్నారు. అయితే మోడలింగ్‌ కన్ఫూజన్‌లో పడేసింది. NYU డిగ్రీ తర్వాత టెక్ కెరీర్‌ను కొనసాగించాలా? లేదా మోడలింగ్‌ కొనసాగించాలా? అనే సందిగ్ధ సమయంలో నా తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించారని ఆమె వివరించింది. చానెల్‌తో ఒప్పందాన్ని కుదుర్చున్న సమయంలో నేను అనుకున్నాను.. రిస్క్‌ ఎంత ఎక్కువగా ఉంటే, బహుమతి అంత ఎక్కువగా ఉంటుంది’ అని భవిత చెప్పింది. చానెల్ అరంగేట్రం ముందు మాథ్యూ బ్లేజీ తన మోడల్స్ కు ఇచ్చే ప్రాథమిక సలహా.. ఎప్పుడూ సరదాగా గడపమని చెబుతాడు. మేము నడక ప్రారంభించే ముందు అన్ని మోడల్స్ కు మ్యాథ్యు చెప్పేది అదే’ అని ఆమె చెప్పింది.

కాగా ఛానల్ షోను ప్రారంభించిన తొలి భారతీయ మోడల్‌గా భవిత చరిత్ర సృష్టించింది. భవిత మండవ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి కావడం విశేషం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.