అట్టుడుకుతున్న హాంకాంగ్.. రెండో రోజు విమానాలు రద్దు
హాంకాంగ్ అట్టుడుకుతోంది. నేరస్తుల అప్పగింత బిల్లుపై చైనా జోక్యాన్ని నిరసిస్తూ ప్రొడెమోక్రసీ సభ్యులు చేస్తున్న ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వేలాదిమంది ఆందోళనకారులు హాంకాంగ్ సురక్షితం కాదంటూ ప్లకార్డులు పట్టుకుని హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోకి చొచ్చుకెళ్లారు. వీరంతా ఒక్కసారిగా ప్రవేశించడంతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఏకంగా సోమవారం విమాన సేవలు రద్దయిపోయాయి. ఇదే పరిస్థితి మంగళవారం కూడా కొనసాగడంతో సౌకర్యాలు కల్పించలేక అధికారులు చేతులెత్తేశారు. ఆందోళన కారులతో నిండిపోయిన హాంకాంగ్ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు బయటకు […]
హాంకాంగ్ అట్టుడుకుతోంది. నేరస్తుల అప్పగింత బిల్లుపై చైనా జోక్యాన్ని నిరసిస్తూ ప్రొడెమోక్రసీ సభ్యులు చేస్తున్న ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వేలాదిమంది ఆందోళనకారులు హాంకాంగ్ సురక్షితం కాదంటూ ప్లకార్డులు పట్టుకుని హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోకి చొచ్చుకెళ్లారు. వీరంతా ఒక్కసారిగా ప్రవేశించడంతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.
ఏకంగా సోమవారం విమాన సేవలు రద్దయిపోయాయి. ఇదే పరిస్థితి మంగళవారం కూడా కొనసాగడంతో సౌకర్యాలు కల్పించలేక అధికారులు చేతులెత్తేశారు. ఆందోళన కారులతో నిండిపోయిన హాంకాంగ్ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు బయటకు వెళ్లిపోవాల్సిందిగా విమానాశ్రయ అధికారులు విఙ్ఞప్తి చేశారు. నిరసనలతో హోరెత్తిన విమానాశ్రయంలో ఏ పని సాగని పరిస్థితి నెలకొంది. ఇతర దేశాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దుకావడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.