5

వామ్మో.. ఈ ఆలూ చిప్స్ రేట్‌ వింటే గుండె గుభేల్!

పొటాటో చిప్స్ పాకెట్.. మాములుగా పది రూపాయలకు.. లేదా 20 రూపాయలకు దొరుకుతుంది. ఇంకా చెబితే సినిమా థియేటర్‌లో 100 రూపాయలు ఉంటుంది. అయితే చిప్స్ పాకెట్ ఏకంగా వేలల్లో ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి.? అవునండీ ఇది నిజమే.. కేవలం అయిదు చిప్స్ విలువ ఏకంగా 3,993 రూపాయలు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఆలూ చిప్స్‌ను.. స్వీడన్‌కు చెందిన సెయింట్ ఎరిక్ బ్రేవరీ అనే కంపెనీ తయారు చేసి విక్రయిస్తోంది. అక్కడ ధర […]

వామ్మో.. ఈ ఆలూ చిప్స్ రేట్‌ వింటే గుండె గుభేల్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 14, 2019 | 9:59 AM

పొటాటో చిప్స్ పాకెట్.. మాములుగా పది రూపాయలకు.. లేదా 20 రూపాయలకు దొరుకుతుంది. ఇంకా చెబితే సినిమా థియేటర్‌లో 100 రూపాయలు ఉంటుంది. అయితే చిప్స్ పాకెట్ ఏకంగా వేలల్లో ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి.? అవునండీ ఇది నిజమే.. కేవలం అయిదు చిప్స్ విలువ ఏకంగా 3,993 రూపాయలు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఆలూ చిప్స్‌ను.. స్వీడన్‌కు చెందిన సెయింట్ ఎరిక్ బ్రేవరీ అనే కంపెనీ తయారు చేసి విక్రయిస్తోంది. అక్కడ ధర ప్రకారం ఈ పాకెట్ విలువ 56 డాలర్లు.అది మన ఇండియన్ కరెన్సీలో అయితే రూ.3,994లు. అంటే ఒక్కో చిప్ ధర 784 రూపాయలు. పొటాటో చిప్‌కు ఇంత రేట్ ఎందుకు అనుకుంటున్నారు కదా.. ఇక్కడ చిప్స్ గొప్పతనం ఏమి లేదండీ. ఉన్నదంతా వాటిని పెట్టి ఇచ్చే బాక్స్‌లోనే ఉంది. అది ఒక జ్యుయలరీ బాక్స్.. అందులో ఐదు చిప్స్ మాత్రమే పడతాయి.

ఆ సంస్థ మేనేజర్ మార్క్స్ ప్రియరీ మాట్లాడుతూ.. ‘మా కంపెనీకి వచ్చే వారికి బీరుతో పాటు సర్వ్ చేసేందుకు ప్రత్యకమైన స్నాక్‌ని అంతకంటే ప్రత్యేకంగా తయారు చేయించిన బాక్స్‌లో అందించాలనుకున్నాం. అందుకే ఈ ఆలూ చిప్స్ రూపొందించాం. అంతేకాకుండా ఈ చిప్స్ ఐదు వివిధ రకాలు టేస్టులలో ఉంటాయని.. వాటి కోసం అత్యంత అరుదైన సామాగ్రిని ఉపయోగించామని అన్నారు.