Pakistan: రాయబార కార్యాలయ భవనాన్ని అమ్ముకున్న పాకిస్థాన్..

|

Jul 14, 2023 | 9:35 PM

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. కాలం వెల్లదీసేందుకు అక్కడి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలాకాలంగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక.. అప్పులు తీర్చలేక.. పాకిస్తాన్ వాషింగ్టన్‌లోని ఆస్తులు అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.

Pakistan: రాయబార కార్యాలయ భవనాన్ని అమ్ముకున్న పాకిస్థాన్..
Pakistan Building
Follow us on

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. కాలం వెల్లదీసేందుకు అక్కడి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలాకాలంగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక.. అప్పులు తీర్చలేక.. పాకిస్తాన్ వాషింగ్టన్‌లోని ఆస్తులు అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని అమ్మకానికి పెట్టిన రాయబార కార్యాలయంను 7.1 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. అయితే 2003 నాటి నుంచి వాషింగ్టన్‌లో ఉన్న పాకిస్థాన్ భవనమైన ఎంబసీ ఖాళీగానే ఉంది. దీంతో 2018లోనే దౌత్య హోదా కోల్పోయిన ఈ భవనాన్ని కొనేందుకు భారత్‌కు చెందిన ఓ సంస్థతో సహా పలు సంస్థలు పోటిపడ్డాయి. కానీ చివరికి పాకిస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త హఫీజ్ ఖాన్ ఈ భవనాన్ని 7.1 డాలర్లకు దక్కించుకున్నారు.

పాకిస్థాన్‌కు వాషింగ్టన్‌లో రెండు చోట్ల రాయబార కార్యాలయాలున్నాయి. ఆర్ స్ట్రీట్‌లో ఉన్న భవనాన్ని 1956 లో కొన్నారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు నడిచాయి. ఆ తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. అయితే శిథిలావ్యవస్థకు చేరుకున్న ఈ బిల్డింగ్ ను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ గత ఏడాది బిడ్ లను ఆహ్వానించింది. ఆ తర్వాత ఎలాంటి వివరణ ఇవ్వకుండా బిడ్డింగ్‌ను ఆపేసింది. ఒకప్పుడు క్లాస్-2 హోదాలో ఉన్న ఈ భవనం.. ఇప్పుడు క్లాస్-4 స్థాయికి పడిపోయింది.