Farideh Moradkhani: కిరాతకం.. మామ పాలనను వ్యతిరేకించిన మేనకోడలు.. మూడేళ్ల జైలు శిక్ష..

|

Dec 11, 2022 | 3:34 PM

ఇరాన్‌ దేశం హిజాబ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హిజాబ్ సరిగా ధరలించలేదన్న కారణంతో మోరాలిటీ పోలీసుల కస్టడీలో ఉన్న మహ్సా అమిని మరణించిన విషయం తెలిసిందే.

Farideh Moradkhani: కిరాతకం.. మామ పాలనను వ్యతిరేకించిన మేనకోడలు.. మూడేళ్ల జైలు శిక్ష..
Farideh Moradkhani
Follow us on

ఇరాన్‌ దేశం హిజాబ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హిజాబ్ సరిగా ధరలించలేదన్న కారణంతో మోరాలిటీ పోలీసుల కస్టడీలో ఉన్న మహ్సా అమిని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఇరాన్‌లో హిజాబ్, మోరాలిటీ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలో వందలాది మంది మరణించారు. ఇరాన్‌ మహిళల ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు.. జైలు శిక్ష విధిస్తోంది. కాగా, మహిళల ఆందోళనకు మద్దతుగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఇరాన్ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ మేనకోడలు ఫరీదే మొరాద్‌ఖనీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. హిజాబ్‌ వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలపడంతోపాటు ఖమేనీ పాలనను బహిరంగంగా విమర్శించారన్న అభియోగాలపై స్థానిక కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఫరిదే మొరాద్‌ఖనీ చాలా కాలంగా ఇరాన్‌ పాలనను బహిరంగంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నవంబరు 23న పోలీసులు ఆమెను అరెస్టు చేసి.. స్థానిక కోర్టులో హాజరు పర్చారు.

మొరాద్‌ఖనీ అరెస్టును చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దేశంలోని న్యాయ వ్యవస్థ నుంచి స్వతంత్రంగా ఉండే మత సంబంధిత కోర్టులో ఆమెపై విచారణ జరిగిందని, ఇది సుప్రీం నాయకుడికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని మొరద్‌ఖనీ తరఫు న్యాయవాది వెల్లడించారు. మొదట 15 ఏళ్ల జైలు శిక్ష విధించారని, అనంతరం అప్పీల్‌ చేసుకోగా.. మూడేళ్లకు కుదించినట్లు తెలిపారు.

మొరాద్‌ఖనీ తల్లి, సుప్రీం నేత అలీ ఖమేనీ సోదరి బద్రీ హొస్సేనీ ఖమేనీ సైతం ఇరాన్‌ పాలనను వ్యతిరేకించారు. దేశంలోని నిరసనలకు సంఘీభావం ప్రకటించడంతోపాటు.. ఖమేనీపై విమర్శలు గుప్పించారు. అలీ ఖమేనీతో తామ సంబంధాలన్నీ తెంచుకున్నామని, ఆయన తన పదవి నుంచి వైదొలగాలని ఓ బహిరంగ లేఖ సైతం విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..