Helicopter Crash: రష్యాలో ఘోర ప్రమాదం.. కురిల్ సరస్సులో కూలిన హెలికాఫ్టర్.. రక్షణ చర్యలు వేగవంతం

|

Aug 12, 2021 | 7:33 AM

Helicopter Crash: రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా లో అగ్నిపర్వతాలు, సుందర ప్రాంతాలను  నిత్యం పర్యాటకులు సందర్శిస్తారు. తక్కువ జనాభాతో ఉన్న ఈ ద్వీపకల్పాన్ని పర్యటించడం కోసం వెళ్లిన..

Helicopter Crash: రష్యాలో ఘోర ప్రమాదం.. కురిల్ సరస్సులో కూలిన హెలికాఫ్టర్.. రక్షణ చర్యలు వేగవంతం
Helicopter Crash
Follow us on

Helicopter Crash: రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా లో అగ్నిపర్వతాలు, సుందర ప్రాంతాలను  నిత్యం పర్యాటకులు సందర్శిస్తారు. తక్కువ జనాభాతో ఉన్న ఈ ద్వీపకల్పాన్ని పర్యటించడం కోసం వెళ్లిన ఎంఐ-8 హెలీకాఫ్టర్ గురువారం తెల్లవారు జామున కూలిపోయింది. ఈ హెలికాఫ్టర్ లో 16మంది ఉన్నారని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..

16 మందితో వెళ్తున్న ఎంఐ-8 హెలికాప్టర్‌ తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలోని కురిల్ సరస్సులో హెలికాప్టర్‌ కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో సిబ్బందితో సహా 16 మంది అందులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ముగ్గురు సిబ్బంది కాగా.. మిగతా వారంతా పర్యాటకులని తెలిపారు. సంఘటనా స్థలానికి 40మందితో కూడిన రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లను పంపినట్లు పేర్కొన్నారు. వారు తొమ్మిదిని రక్షించారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంకా యూగురుని గుర్తించాల్సి ఉందని వారి ఆచూకీ కోసం వేడుకుతున్నామని ఆపరేషన్‌ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

అంతేకాదు ఈ ప్రమాదం పై విచారణ చేపట్టినట్లు వాయు ప్రమాద విచారణ రష్యన్ దర్యాప్తు కమిటీ తెలిపింది. క్షేమంగా ఉన్నావారిని ఖోడుట్కాకు తరలించారు.

Also Read:  పంటినొప్పి వచ్చినప్పుడు ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.. ఉపశమనం పొందండి