AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Los Angeles: కాలిఫోర్నియాలో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న బురదచరియలు.. హాలీవుడ్ ప్రముఖులు ఖాళీ చేయాలంటూ వార్నింగ్!

మాంటెసిటోలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఇక్కడి వాసులు వెంటనే నగరాన్ని వీడాలంటూ అధికారులు ఎమర్జెన్సీ అలర్ట్‌ జారీ చేశారు. హాలీవుడ్‌ కమెడియన్‌ ఎల్లెన్‌ డిజెనెరెస్‌ కూడా నగరంలోని పరిస్థితిపై సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

Los Angeles: కాలిఫోర్నియాలో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న బురదచరియలు.. హాలీవుడ్ ప్రముఖులు ఖాళీ చేయాలంటూ వార్నింగ్!
Heavy Rains Lash Los Angeles
Surya Kala
|

Updated on: Jan 10, 2023 | 5:03 PM

Share

అమెరికాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో హాలీవుడ్‌ ప్రముఖులు నివసించే మాంటెసిటో ప్రాంతానికి బురద ముప్పు పొంచి ఉంది.  ఓ వైపు విరిగి పడుతున్న బురద చరియలు.. మరో వైపు భారీ వర్షాలతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు మరింతగా బురద చరియలు విరిగిపడి విలాసవంతమైన భవనాలను ముంచెత్తే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. దీంతో ఇక్కడి వాసులు వెంటనే నగరాన్ని వీడాలంటూ అధికారులు ఎమర్జెన్సీ అలర్ట్‌ జారీ చేశారు. ఇందుకు సంబంధించి మాంటెసిటో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్లో పేర్కొంది. అటు హాలీవుడ్‌ కమెడియన్‌ ఎల్లెన్‌ డిజెనెరెస్‌ కూడా నగరంలోని పరిస్థితిపై సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ ప్రాంతం నుంచి తప్పకుండా తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

తుపాను కారణంగా గత నెల రోజులుగా కాలిఫోర్నియా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాంటెసిటోలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. మరో 24 గంటల్లో ఈ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బురదచరియలు విరిగిపడే ప్రమాదముందని తెలిపారు. ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాల్లో వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో బురద ప్రవాహం పెరిగింది.

ఇవి కూడా చదవండి

లాస్‌ఏంజిల్స్‌కు సమీపంలో ఉండే మాంటెసిటో అనేక మంది హాలీవుడ్‌ ప్రముఖులు నివాసముంటున్నారు. బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మెర్కెల్‌ దంపతులతో పాటు అనేక మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఇక్కడే నివాసముంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!