AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ ను ఉరిమి చూసిందెవరు ? 16 ఏళ్ళ చిన్నదే మరి ?

క్లైమేట్ ఛేంజ్ (వాతావరణ మార్పులు, పరిరక్షణ) పై న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి సమ్మిట్ లో జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకు మొక్కుబడిగా వఛ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోపంతో, ఉరిమి చూసిందో చిన్నారి. తన ముందునుంచి ఆయన మందీ మార్బలంతో వెళ్తుండగా.. పళ్ళు బిగబట్టి.. కళ్ళు ఉరుముతూ తీక్షణంగా చూసింది. ఆమె ఎవరో కాదు.. 16 ఏళ్ళ స్వీడిష్ బాలిక గ్రెటా థన్ బర్గ్.. ట్రంప్ ను ఆ అమ్మాయి కసిగా చూస్తున్న దృశ్యం తాలూకు వీడియో […]

ట్రంప్ ను ఉరిమి చూసిందెవరు ? 16 ఏళ్ళ చిన్నదే మరి ?
Pardhasaradhi Peri
|

Updated on: Sep 24, 2019 | 3:36 PM

Share

క్లైమేట్ ఛేంజ్ (వాతావరణ మార్పులు, పరిరక్షణ) పై న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి సమ్మిట్ లో జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకు మొక్కుబడిగా వఛ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోపంతో, ఉరిమి చూసిందో చిన్నారి. తన ముందునుంచి ఆయన మందీ మార్బలంతో వెళ్తుండగా.. పళ్ళు బిగబట్టి.. కళ్ళు ఉరుముతూ తీక్షణంగా చూసింది. ఆమె ఎవరో కాదు.. 16 ఏళ్ళ స్వీడిష్ బాలిక గ్రెటా థన్ బర్గ్.. ట్రంప్ ను ఆ అమ్మాయి కసిగా చూస్తున్న దృశ్యం తాలూకు వీడియో వైరల్ అయింది. మానవజాతికి పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు పట్టించుకోవడంలేదని ఈ అమ్మాయి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. ప్రతి శుక్రవారం స్వీడిష్ పార్లమెంట్ ఎదుట ఆమె ధర్నా చేస్తోంది. అలాంటి ఈ సాహస బాలిక.. స్వీడన్ నుంచి న్యూయార్క్ కు కాలుష్యం వెదజల్లని పడవలో ప్రయాణించి వచ్చిందట. అసలు ఈ సమ్మిట్ లో మాట్లాడే ఉద్దేశమే తనకు లేదని, తన మాటలను ముఖ్యంగా ట్రంప్ పట్టించుకోనప్పుడు ఆయనతో తాను మాట్లాడి మాత్రం ప్రయోజనమేమిటని గ్రెటా… గతంలోనే సీబీఎస్ కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. మొదట సైన్స్ ఏం చెబుతోందో వినండి అన్నదే తాను ట్రంప్ కు ఇస్తున్న మెసేజ్ అని, కానీ ఆయన దీన్ని వింటాడన్న నమ్మకం తనకు లేదని ఆమె తెలిపింది. ఐరాసలో క్లైమేట్ ఛేంజ్ పై మాట్లాడేందుకు వఛ్చిన ప్రపంచ నాయకులను గ్రెటా దుమ్మెత్తిపోసింది. ‘ మీరు డబ్బుకు, కాల్పనిక జగత్తుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ భూమండలానికి కలిగే ప్రమాదాలను పట్టించుకోవడం లేదు ‘ అంటూ ఒక దశలో కన్నీటి పర్యంతమైంది. అటు-ఈ సమ్మిట్ కు వఛ్చిన ట్రంప్ అక్కడ సుమారు 10, 15 నిముషాలు మాత్రమే గడిపారు. గ్రెటా తీరు పట్ల ఆయన వెటకారంగా స్పందించాడు. ‘ చూడబోతే ఈ అమ్మాయి హ్యాపీ యంగ్ గర్ల్ గా ఉందని, ప్రకాశవంతమైన, వండర్ఫుల్ ఫ్యూచర్ కోసం తహతహలాడుతున్నట్టు ఉందని ‘ ఆయన ట్వీట్ చేశాడు. తరచూ తన కళ్ళు మూసుకుంటూ… అప్పుడప్పుడు వాచీ చూసుకుంటూ కాస్త ‘ అసహనంగా ‘ ట్రంప్ గడిపాడు. గ్రెటాతో బాటు వఛ్చిన మరో 15 మంది బాలలు ఐరాస ప్రధానకార్యదర్శికి ఓ మెమోరాండం సమర్పించారు. జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్, ఆర్జెంటీనా, టర్కీ దేశాలు క్లైమేట్ క్రైసిస్ నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని, యుఎస్ వంటి దేశాలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాయని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని వారు ఈ మెమొరాండంలో పేర్కొన్నారు.