చూడబోతే ఇంగ్లండ్ పోలీసుల తెలివికి ‘జోహార్లు ‘ అర్పించాల్సిందే అంటున్నారు నెటిజన్లు. ఇందుకు కారణం ఈ నెల 4 న హెర్ ఫోర్డ్ పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న ఓ చిన్న (మినీ) ఈ-స్కూటర్ ని ఓ భారీ ట్రక్కుపై తరలించడమే.. కేవలం 15 కిలోల బరువు మాత్రమే ఉన్న ఈ వాహనాన్ని వారు 7.5 టన్నుల రికవరీ ట్రక్కులో తరలించడం చర్చనీయాంశమైంది. పోలీసులు తమ డిపార్ట్ మెంట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూసి ట్రోల్ చేయని వాళ్ళు లేరు. సోషల్ మీడియాలో ఒక్కో యూజరూ ఒక్కో విధంగా స్పందిస్తూ.. ఈ సైజున్న 20-30 స్కూటర్లు సులభంగా పట్టే ఈ భారీ ట్రక్కు మీద ఇంత చిన్ని వాహనాన్ని తీసుకుపోతున్నారా అని ఒకరంటే…పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేయడానికే ఇలా చేస్తున్నారని మరొకరు విమర్శించారు. ఇది మీ శాఖ డబ్బును వేస్ట్ చేయడం గాక మరేమీ కాదని ఇంకొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రైవేటు కంపెనీ ఇలా చేస్తే ఇందుకు బాధ్యులైనవారిని డిస్మిస్ చేసేవారని కొందరు వ్యాఖ్యానించారు. ఆ మినీ వాహనాన్ని మడిచి కారులో పెట్టండి అని కొంతమంది విసుక్కున్నారు.
అయితే పోలీసులు ఈ ఫోటోను హైలైట్ చేస్తూ..అనుమతించదగని చోట్ల ఇలాంటి వాహనాలను నడిపితే ఇందుకు బాధ్యులైనవారిని ప్రాసిక్యూట్ చేస్తామని, ఇన్సూరెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా 300 పౌండ్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఏమైనా అతి చిన్న వాహనాన్ని భారీ ట్రక్కులో తరలించడాన్ని మాత్రం ప్రజలు ‘జీర్ణించుకోలేకపోతున్నారు’.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆరు బయట నవారు మంచం మీద పిల్లలతో అలా బన్నీ హాయి ని అనుభవిస్తున్న అల్లు అర్జున్ : Allu Arjun Video viral.